మెగా హీరో మెన్స్ డే కానుక‌

సుప్రీం హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ పేరు మార్చుకున్న త‌ర్వాత క‌లిసొస్తున్న సంగ‌తి తెలిసిందే. ధ‌ర‌మ్ ని త‌ప్పించి సాయి తేజ్ గా మారి న‌టించిన `చిత్ర‌ల‌హ‌రి` అబౌ యావ‌రేజ్ గా ఆడింది. న‌టుడిగా త‌న‌కు పేరు తెచ్చిన చిత్ర‌మిది. ఇదే హుషారులో మారుతి ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్నాడు. ప్ర‌తిరోజు పండ‌గే చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. డిసెంబ‌ర్ 20న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్నారు. ఈ సినిమా పాట‌లు ప్ర‌మోష‌న్ వీడియోలు ఆక‌ట్టుకున్నాయి. సాయి తేజ్ కి మ‌రోసారి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ అందుతుండ‌డం ఉత్సాహం నింపుతోంది.

ఇక ఇదే హుషారులో సాయి తేజ్ మ‌రో కొత్త సినిమాని ప్ర‌క‌టించేశాడు. ఈసారి `సోలో బ్ర‌తుకే సో బెట‌ర్` అనే టైటిల్ తో సెట్స్ కి వెళ్లేందుకు రెడీ అవుతున్నాడు. అది కూడా టైటిల్ కి త‌గ్గ‌ట్టే పురుషాధిక్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తూ  ఇంట‌ర్నేష‌న‌ల్ మెన్స్ డే రోజున ఈ ప్ర‌క‌ట‌న చేయ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రానికి డెబ్యూ సుబ్బు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. అత్తారింటికి దారేది నిర్మాత బీవీఎస్ఎన్ ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2020 మే 1న కార్మిక దినోత్స‌వం కానుక‌గా రిలీజ్ చేయ‌నున్నామ‌ని ప్ర‌క‌టించ‌డం మ‌రో వింత‌. మెన్స్ డే శుభాకాంక్ష‌ల‌తో పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంది. ఈ పోస్ట‌ర్ పైనా సాయి తేజ్ అని క‌నిపించేలా వేశారు పెద్ద‌క్ష‌రాలు.. ఇంట్రెస్టింగ్!!