ఒక్క హిట్ ప్లీజ్ అంటున్న అల్లుళ్ళు

Last Updated on by

చూస్తుంటే ఇండ‌స్ట్రీలో అల్లుళ్ల‌కు బాగా బ్యాడ్ టైమ్ న‌డుస్తున్న‌ట్లుంది. మెగా మేన‌ల్లుడు ఇప్పుడు ఒక్క హిట్ అంటూ ఎదురు చూస్తున్నాడు. ఇక మ‌రో అల్లుడికి కూడా ఇప్పుడు ఇదే ప‌రిస్థితి వ‌చ్చింది. అత‌డే సందీప్ కిష‌న్.. మేన‌ల్లుడు ఆఫ్ ఛోటా కే నాయుడు. కొండంత మామ అండ ఉన్నా కూడా అవ‌కాశాల కోసం నానా తంటాలు ప‌డ్డాడు సందీప్. హీరో అవ్వ‌డానికి ఎన్నో నిద్ర‌లేని రాత్రులు శ్ర‌మించాడు. అన్నీ ఫ‌లించి అవ‌కాశాలైతే సంపాదిస్తున్నాడు కానీ విజ‌యాలు మాత్రం అందుకోవ‌డం లేదు ఈ కుర్ర హీరో. తెలుగు ఇప్ప‌టి వ‌ర‌కు ఈయ‌న చేసిన డ‌జ‌న్ సినిమాల్లో ఆడింది ఒకే ఒక్క సినిమా.. అది వెంకటాద్రి ఎక్స్ ప్రెస్.

వార‌స‌త్వం ఉన్నా కూడా వాళ్ల‌ను వాడుకోకుండా సొంతంగానే ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన సందీప్ కిష‌న్.. ఇప్పుడు ఒక్క విజ‌యం అంటూ మొహం వాచేలా వేచి చూస్తున్నాడు. మామ పేరు చెప్పినా ఇండ‌స్ట్రీలో హీరోగా అవ‌కాశాలైతే రావు క‌దా..? అందుకే వ‌చ్చిన వాటిని ప్లాన్ చేసుకుంటున్నాడు.. కానీ విజ‌యాలే మ‌నోన్ని చిన్న‌చూపు చూస్తున్నాయి. మొన్న‌టికి మొన్న న‌క్ష‌త్రం.. కేరాఫ్ సూర్య‌.. ప్రాజెక్ట్ జెడ్ అంటూ భారీ ప్లాపులిచ్చిన సందీప్.. ఇప్పుడు కొత్త ఏడాదిలోనూ కొత్త‌గా డిజాస్ట‌ర్ తోనే మొద‌లుపెట్టాడు. ఈయ‌న న‌టించిన మ‌న‌సుకు న‌చ్చింది కూడా ఎవ‌రి మ‌న‌సుకు న‌చ్చ‌లేదు. మంజుల తెర‌కెక్కించిన ఈ చిత్రం సందీప్ కెరీర్ కు మ‌ళ్లీ ఫ్లాప్ నే గిఫ్ట్ గా ఇచ్చింది. మొత్తానికి ఈ అల్లున్ని కాపాడ్డానికి ఇప్పుడు ఏ ద‌ర్శ‌కుడు దిగి రావాలో మ‌రి..?

User Comments