సాయిధ‌రంతేజ్ వెన‌క ఉన్న శ‌క్తి ఎవ‌రు..?

Last Updated on by

మీ వెన‌క ఏదో శ‌క్తి ఉంద‌మ్మా.. అది ఉన్న‌న్ని రోజులు ఎవ‌రూ ఏమీ చేయ‌లేరు అంటూ అత్తారింటికి దారేదిలో ప‌వ‌న్ ను ఉద్దేశించి ఓ డైలాగ్ రాసాడు త్రివిక్ర‌మ్. అది అచ్చంగా ఇప్పుడు సాయిధ‌రంతేజ్ కు సూట్ అవుతుంది. ఈయ‌న వెన‌క కూడా ఓ శ‌క్తి ఉంది. అదెవ‌రో క‌నిపించ‌ట్లేదు. లేక‌పోతే ఏంటి ఈ ఇండ‌స్ట్రీలో ఒక్క ప్లాప్ వ‌స్తేనే ఎవ‌రూ ప‌ట్టించుకోరు. స్టార్ హీరోలైతే ఎన్ని ఫ్లాపులు వ‌చ్చినా మ‌ళ్లీ నిల‌బ‌డ‌తారు కానీ మినిమ‌మ్ గ్యారెంటీ హీరోల‌కు రెండు మూడు ఫ్లాపులు వ‌స్తే ప‌ట్టించుకోరు. కానీ సాయిధరంతేజ్ మాత్రం వ‌ర‌స‌గా ఐదు డిజాస్ట‌ర్లు ఇచ్చినా కూడా ఇంకా ఆయ‌నే కావాలంటున్నారు. అస‌లు ఏం మాయ చేస్తున్నాడో తెలియ‌దు కానీ ఇప్పుడు సాయి కోసం ద‌ర్శ‌క నిర్మాత‌లంతా క్యూ క‌డుతున్నారు. ఈయ‌న గ‌త సినిమా ఇంటిలిజెంట్ క‌నీసం 4 కోట్ల షేర్ కూడా వ‌సూలు చేయ‌లేక‌పోయింది. వినాయ‌క్ లాంటి బ్రాండ్ ఉన్నా కూడా ఈ చిత్రం ఆల్ టైమ్ డిజాస్ట‌ర్ గా నిలిచింది.

ఇన్ని ఫ్లాపులు ఉన్నా కూడా మ‌నోడి ఫ్యూచర్ కు ఏం ఢోకాలేదు. పెద్ద ద‌ర్శ‌కులు వ‌చ్చి నీతో సినిమా చేస్తాం అన‌ట్లేదు కానీ పేరున్న ద‌ర్శ‌కులే వ‌చ్చి సాయి కావాలంటున్నారు. వీటిలో ఏ ఒక్క‌టి క్లిక్ అయినా మ‌నోడి జాత‌కం మారిపోతుంది. ప్ర‌స్తుతం క‌రుణాక‌ర‌ణ్ సినిమాతో బిజీబిజీగా ఉన్నాడు సాయి. ఈ సినిమా షూటింగ్ ఈ మ‌ధ్యే మొద‌లైంది. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ఇందులో హీరోయిన్. కేఎస్ రామారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ సినిమా కోసం సాయి ఏ రెమ్యున‌రేష‌న్ తీసుకోవ‌డం లేద‌ని.. లాభాల్లో వాటా మాత్ర‌మే తీసుకుంటున్నాడ‌ని తెలుస్తుంది. ఇక క‌రుణాక‌ర‌ణ్ కు కూడా చాలా త‌క్కువ రెమ్యున‌రేష‌న్ ఇచ్చారు.

ఇక ఇదిలా ఉండ‌గానే చంద్ర‌శేఖ‌ర్ యేలేటి కూడా ఏరికోరి సాయిధ‌రంతేజ్ నే హీరోగా ఎంచుకున్నాడు. ఈయ‌న సాయితో ఓ క్రైమ్ థ్రిల్ల‌ర్ ప్లాన్ చేస్తున్నాడు. ఈ చిత్రం త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ల‌నుంది. ఈ సినిమా కంటే ముందే గోపీచంద్ మ‌లినేని సినిమా ప‌ట్టాలెక్కించ‌నున్నాడు సాయిధ‌రంతేజ్. మే నుంచి ఇది ప‌ట్టాలెక్క‌నుంది. డిసెంబ‌ర్ లో విడుద‌ల‌కు ప్లాన్ చేస్తున్నాడు గోపీచంద్. గ‌తంలో ఈ కాంబినేష‌న్ లో వ‌చ్చిన విన్న‌ర్ డిజాస్ట‌ర్ అయింది. అయినా కూడా మ‌రో ఛాన్స్ ఇచ్చాడు సాయి. ఇక మారుతి కూడా మ‌నోడితో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఇవ‌న్నీ ఉండ‌గానే ఇప్పుడు మైత్రి మూవీ మేక‌ర్స్ తో కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్నాడు. నాని కాద‌నుకున్న సినిమా ఇప్పుడు సాయి చేతుల్లోకి వ‌చ్చింది. మొత్తానికి వ‌ర‌స‌గా ఇన్నేసి సినిమాలు చేస్తున్నాడు సాయి. మ‌రి ఇందులో ఏది ఈయ‌న కెరీర్ ను నిల‌బెడుతుందో చూడాలి..!

User Comments