అల్లుడు.. లెట్స్ డూ గిల్లుడు..!

Last Updated on by

చిరంజీవి పాటే ఇప్పుడు అల్లుళ్లు పాడుకుంటున్నారు. అక్క‌డ మామ అమ్మ‌డు కుమ్ముడు అంటే ఇక్క‌డ అల్లుడు.. గిల్లుడు అంటున్నారు. అస‌లు విష‌యం ఏంటంటే ఇప్పుడు మెగా అల్లుడు.. మేన‌ల్లుడు ఒకేరోజు త‌మ సినిమాల‌తో బాక్సాఫీస్ దండ‌యాత్ర‌కు వ‌స్తున్నారు. జులై 6 ఈ ఇద్ద‌రూ త‌మ సినిమాల‌కు ముహూర్తం పెట్టుకున్నారు. తేజ్ ఐ ల‌వ్ యూ అంటూ సాయిధ‌రంతేజ్ ఆ రోజు వ‌స్తుంటే.. విజేత అవ్వ‌డానికి చిరు చిన్న‌ల్లుడు క‌ళ్యాణ్ కూడా అదే రోజు వ‌స్తున్నాడు. ఈ ఇద్ద‌రిలో ఎవ‌రు ఇప్పుడు వెన‌క్కి త‌గ్గేలా లేరు. పైగా ఇప్పుడు సాయిధ‌రంతేజ్ వ‌ర‌స ప్లాపుల్లో ఉన్నాడు కాబ‌ట్టి ఖచ్చితంగా తేజ్ సినిమా విజ‌యం సాధించ‌డం ఈయ‌న‌కు అవ‌స‌రం.

మ‌రోవైపు క‌ళ్యాణ్ కూడా తొలి సినిమాతోనే గుర్తింపు తెచ్చుకోవాల‌ని చూస్తున్నాడు. జూన్ 29నే విడుదల కావాల్సిన తేజ్ ఐ ల‌వ్ యూ చిత్రం వారం రోజులు ఆలస్యంగా వ‌స్తుంది. జూన్ 29న సంజూ వ‌స్తుండ‌టంతో.. త‌న సినిమాను వారం రోజులు పోస్ట్ పోన్ చేసుకున్న‌ట్లు తెలుస్తుంది. ఇక విజేత నిర్మాత సాయి కొర్ర‌పాటికి జులై 6 సెంటిమెంట్. ఆరేళ్ల కింద అదే రోజు ఈగ విడుద‌లై సంచ‌ల‌నం సృష్టించింది. దాంతో మ‌ళ్లీ ఆ రోజే విజేత సినిమా విడుద‌ల చేయాల‌నుకుంటున్నాడు ఈ నిర్మాత‌. ఇలా అల్లుడు.. మేన‌ల్లుడు ఒకేరోజు త‌మ సినిమాల‌తో వ‌స్తున్నారు. మ‌రి ఈ వార్ లో ఎవ‌ర్ని విజ‌యం వ‌రిస్తుందో..?

User Comments