Last Updated on by
ఈ మధ్య ఒకే ఫ్యామిలీ హీరోలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడటం ఫ్యాషన్ అయిపోయింది. రెండేళ్ల కింద నందమూరి వారసులు అలాగే వచ్చారు. అప్పుడు ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో అంటే.. బాలయ్య డిక్టేటర్ అన్నాడు. అప్పుడు కనీసం రెండు రోజులు గ్యాప్ తీసుకుని వచ్చారు ఆ హీరోలు. కానీ ఇప్పుడు మెగా హీరోలు ఆ గ్యాప్ కూడా ఇవ్వడం లేదు. ప్రస్తుతం మెగా హీరోలంతా ఫుల్ బిజీగా ఉన్నారు. ఎవరి సినిమాలతో వాళ్లు సందడిగా ఉన్నారు. ఇలాంటి టైమ్ లో వాళ్ల సినిమాల విడుదల తేదీలు మాత్రం.. మరో మెగా హీరోల సినిమాల విడుదల తేదీలతో క్లాష్ అవుతున్నాయి. అది దర్శక నిర్మాతలకు తెలియడం లేదో.. లేదంటే లైట్ తీసుకుంటున్నారో తెలియదు కానీ ఓ హీరో సినిమాతో మరో మెగా హీరో పోటీ పడుతున్నాడు. ఇప్పుడు వరుణ్ తేజ్ తో సాయిధరంతేజ్ పోటీకి సై అంటున్నాడు.
ఫిబ్రవరి 9న వరుణ్ తేజ్ తొలిప్రేమ విడుదల కానుందని అనౌన్స్ చేసారు దర్శక నిర్మాతలు. ఈ విడుదల తేదీనికి మూడు నెలల కిందే ప్రకటించాడు నిర్మాత. వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ చిత్రంలో రాశీఖన్నా హీరోయిన్. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత. ఇప్పటికే విడుదలైన పాటలకు.. టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఇది కచ్చితంగా అప్పుడు పవన్ కెరీర్ కు ఎలాగైతే తొలిప్రేమ మైల్ స్టోన్ అయిందో.. ఇప్పుడు వరుణ్ కెరీర్ కు అవుతుందని అంచనాలు వేస్తున్నారు దర్శక నిర్మాతలు.
ఇక ఇదే ఫిబ్రవరి 9న తేదీన సాయిధరంతేజ్-వినాయక్ సినిమా కూడా రానుంది. ఇంటలిజెంట్ అనే టైటిల్ ఈ చిత్రానికి ఫిక్స్ చేస్తూ తాజాగా ప్రకటన కూడా ఇచ్చారు దర్శక నిర్మాతలు. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ఆకుల శివ కథ అందించిన ఈ చిత్రానికి వినాయక్ దర్శకుడు కావడంతో అంచనాలు పెరిగిపోయాయి. పైగా ఖైదీ నెం.150 లాంటి సినిమా తర్వాత వస్తోన్న సినిమా కావడంతో సాధారణంగానే అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ ఇద్దరు మెగా హీరోలు ఒకేరోజు రానుండటం నిర్మాతలకు కూడా ఇబ్బందే. అయితే సాయి పూర్తి మాస్ సినిమాతో వస్తుంటే.. వరుణ్ మాత్రం పూర్తిగా లవ్ స్టోరీతో వస్తున్నాడు. మరి ఈ రెండు సినిమాల క్లాష్ బాక్సాఫీస్ దగ్గర ఎలా ఉండబోతుందో..?
User Comments