మహానగరంలో మాయగాడు గా సాయిధరమ్ తేజ్

టాలీవుడ్ మెగా ఫ్యామిలీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా మారుతున్నాయి. ఇంతకుముందే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా నేను లోకల్ ఫేమ్ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కేలా చర్చలు జరుగుతున్నాయని న్యూస్ వచ్చిన విషయం తెలిసే ఉంటుంది. అందులో అలనాటి మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ సినిమా ‘మంత్రిగారి వియ్యంకుడు’ ను ఆధారంగా చేసుకుని ఇప్పుడు చెర్రీకి తగ్గట్లు కథ ప్రిపేర్ చేస్తున్నారని, అంటే ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్టు ఆ సినిమా కథకు అప్డేట్ వెర్షన్ రెడీ చేస్తున్నారని ప్రచారం కూడా జరిగింది.

ఇది మర్చిపోక ముందే ఇప్పుడు తాజాగా మరో ఇంట్రెస్టింగ్ మెగా అప్డేట్ ఒకటి సినీ సర్కిల్ లో చక్కర్లు కొట్టడం స్టార్ట్ అయింది. ఆ స్టోరీలోకి వెళితే, ప్రస్తుతం ‘జవాన్’ అనే సినిమా చేస్తోన్న సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ నెక్స్ట్ మాస్ డైరెక్టర్ వీవీ వినాయక్ తో ఓ సినిమాను, ప్రేమకథల స్పెషలిస్ట్ కరుణాకరన్ తో ఓ సినిమాను లైన్ లో పెట్టిన విషయం తెలిసే ఉంటుంది. ఇవి కాకుండా ఇప్పుడు మరో డైరెక్టర్ సాయిధరమ్ తేజ్ కోసం లైన్ లోకి వచ్చాడని తెలియడం విశేషం. ఆ డైరెక్టర్ మరెవరో కాదు.. ప్రస్తుతం శర్వానంద్ తో ‘మహానుభావుడు’ తెరకెక్కిస్తోన్న డైరెక్టర్ మారుతి. ఈ క్రేజీ డైరెక్టర్ తన నెక్స్ట్ సినిమా ప్లానింగ్ లో భాగంగా తాజాగా సాయిధరమ్ తేజ్ కు ఓ స్టోరీ లైన్ కూడా వినిపించేశాడట.

అంతేకాకుండా పూర్తి స్క్రిప్ట్ ఆగష్టులో వినిపిస్తానని చెప్పేశాడట. ఇదంతా బాగానే ఉన్నా.. అంతకుమించి అనేలా ఈ కథకు మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ చిత్రం ‘మహానగరంలో మాయగాడు’ అనే టైటిల్ పర్ఫెక్ట్ గా ఉంటుందని మారుతి చెప్పినట్లు తెలియడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఓవైపు, రామ్ చరణ్ మంత్రిగారి వియ్యంకుడు కథను రీమేక్ చేయబోతున్నట్లు వార్తలు వస్తుంటే, ఇప్పుడు ఇలా సాయిధరమ్ తేజ్ మహానగరంలో మాయగాడు టైటిల్ కు ఫిదా అయిపోతున్నాడని టాక్ బయటకు రావడం నిజంగా విశేషమే. మరి అన్నీ అనుకున్నట్లే జరిగితే వచ్చే ఏడాది ఈ సినిమా ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయని ఇన్నర్ సర్కిల్ లో ప్రచారం కూడా జరుగుతుండటం ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్ అవుతుంది.

Follow US