సాయి ఇంటిలిజెంట్ ఇమిటేషన్

ఇంటిలిజెంట్ లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో పాటు చిరంజీవిని కూడా దించేసాడు సుప్రీమ్ హీరో. ఛ‌మ‌క్ ఛ‌మ‌క్ ఛాం పాట‌లో అచ్చంగా 80ల్లో ఉండే చిరంజీవినే గుర్తు చేసాడు మెగా మేన‌ల్లుడు. అది కావాలని చేసాడో.. లేదంటే మేన‌రికంలో వ‌చ్చిన వ‌ర‌మో తెలియ‌దు మ‌రి. చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా కావాల‌నే చేసిన‌ట్లుగా తెలిసిపోతుంది. వినాయ‌క్ కూడా త‌న‌కు ఛ‌మక్ ఛ‌మ‌క్ పాట చూస్తుంటే అచ్చంగా చిరంజీవి గారిని చూస్తున్న‌ట్లే ఉంద‌ని చెప్పాడు. కావాల‌నే కొన్ని షాట్లు ప‌వ‌న్, చిరు మాదిరి సాయితో తీసాన‌ని చెప్పాడు ఈ ద‌ర్శ‌కుడు. ఈ పాట ఖచ్చితంగా విజువ‌ల్ ట్రీట్ అవుతుంద‌న‌డంలో పెద్ద‌గా ఆశ్చ‌ర్యం అయితే లేదు. ఎప్ప‌ట్లాగే త‌న‌దైన శైలిలో డాన్సులు కుమ్మేసాడు సాయిధ‌రంతేజ్.

ఇక లావ‌ణ్య కూడా అందాల‌తో ఆక‌ట్టుకుంది. ఇంటిలిజెంట్ సినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను కూడా వ‌ద‌ల్లేదు సాయి. ట్రైల‌ర్ లోనే బ‌ద్రిలోని ఏ చికితా గెట‌ప్ దించేసాడు సాయి. ట్రైల‌ర్ ఎండ్ షాట్ కూడా ఇదే. వినాయ‌క్ కావాల‌నే ఈ షాట్స్ తీసాన‌ని ప్రీ రిలీజ్ వేడుక‌లోనే చెప్పాడు. అంటే ఖచ్చితంగా మేన‌ల్లుడు మావ‌య్య‌ల‌ను ఇప్ప‌ట్లో వాడ‌కం ఆపేయ‌డ‌న్న‌మాట‌. ఇప్ప‌టికే ప్ర‌తీ సినిమాలోనూ మేన‌మామ‌ల రిఫెరెన్స్ ఒక్క‌టైనా ఉండేలా చూసుకుంటూ వ‌చ్చాడు సాయి. ఇక‌పై కూడా ఇదే చేస్తాడు.. చేసేలా ఉన్నాడు కూడా..! అంతేలెండి.. ఎవ‌రెవ‌రో బ‌య‌టి వాళ్లే మెగా హీరోల‌ను వాడేస్తున్నారు. అలాంటిది సొంత మేన‌ల్లుడు ఎందుకు వాడుకోకుండా ఉంటాడు చెప్పండి..!