మ‌హేష్‌తో రైస్‌మిల్ ఓన‌ర్ కిరికిరి

Last Updated on by

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న 25వ సినిమా ప్ర‌స్తుతం హాట్ టాపిక్‌. ఊపిరి వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్‌ని తెర‌కెక్కించిన వంశీ పైడిప‌ల్లి ఈ సినిమా కోసం దాదాపు రెండేళ్లు పైగానే వేచి చూశాడు. అత‌డి వెయిటింగ్ ఫ‌లించి ప్ర‌స్తుతం ఈ సినిమా సెట్స్‌పై ఉంది. ఆన్ లొకేష‌న్ వంశీ శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ సాగిస్తున్నాడు. డార్జిలింగ్‌లో తొలి షెడ్యూల్ పూర్త‌వ్వ‌గానే హైద‌రాబాద్‌ షెడ్యూల్ ప్రారంభించారు. రామోజీ ఫిలింసిటీలో భారీ విలేజ్ సెట్స్‌లో కీల‌క స‌న్నివేశాల్ని చిత్రీక‌రిస్తున్నార‌ట‌.

ఇక‌పోతే ఈ సినిమాలో మ‌హేష్ రైతుగా, రైతు బాంధ‌వుడిగా న‌టిస్తుండ‌గా, అత‌డి స్నేహితుడి పాత్ర‌లో అల్ల‌రి న‌రేష్ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. ఇక డైలాగ్ కింగ్‌ సాయికుమార్ రైస్ మిల్ య‌జ‌మానిగా ర‌క్తికట్టించే పాత్ర‌లో న‌టిస్తున్నార‌ట‌. విలేజ్ అన‌గానే రైస్‌మిల్ కంప‌ల్స‌రీ. అక్క‌డ తెల్ల‌చొక్కా, గ‌ళ్ల‌ఫ్యాంటు తొడుక్కుని, రేబాన్ గ్లాసెస్‌తో స్టైల్‌గా మిల్లింగ్‌ని ప‌ర్య‌వేక్షించేవాడిగా బోలెడంత హ‌డావుడి ఉంటుంది. అదంతా డైలాగ్ కింగ్ సాయికుమార్ చేసి చూపిస్తున్నార‌ట‌. ఇప్ప‌టికే రామోజీ ఫిలింసిటీలో విలేజ్ సెట్ వేసి చిత్రీక‌ర‌ణ చేస్తున్నారు. మ‌రోవైపు మ‌హేష్ బ‌ర్త్ డే కానుక‌గా ఆగ‌స్టు 9న ఫ‌స్టులుక్‌ని లాంచ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. 2019 ఏప్రిల్ 5న ఉగాది కానుక‌గా సినిమా రిలీజ్‌కానుంది.

User Comments