స‌మంత ఆటో.. సాయిప‌ల్ల‌వి డ్రైవ‌ర్..

ఇద్ద‌రూ స్టార్ హీరోయిన్లే. ఆ మాట‌కొస్తే స‌మంత మ‌న‌సు దోచిన హీరోయిన్ సాయిప‌ల్ల‌వి. ఇప్పుడు ఈ ఇద్ద‌రికి ఆటోతో లింక్ ఉంది. స‌మ్మ‌ర్ లో హ్యాట్రిక్ విజ‌యాలు అందుకుని జోరు మీదున్న స‌మంత‌.. ప్ర‌స్తుతం యు ట‌ర్న్ సినిమాతో బిజీగా ఉంది. ఈ చిత్ర షూటింగ్ వేగంగా జ‌రుగుతుంది. ఈ క్ర‌మంలోనే ఆటోలో కూర్చుని ఈ మ‌ధ్యే ఫోజ్ ఇచ్చింది స‌మంత‌. యు ట‌ర్న్ షూటింగ్ లోనే త‌న యూనిట్ తో క‌లిసి ఈ పోజిచ్చింది స్యామ్. ఈ చిత్రం క‌న్న‌డ‌లో బ్లాక్ బ‌స్ట‌ర్.

క‌థ న‌చ్చి.. ఆ ద‌ర్శ‌కుడు ప‌వ‌న్ కుమార్ తోనే యు ట‌ర్న్ సినిమా తెలుగు, త‌మిళ్ లో చేస్తుంది స‌మంత‌. ఇక సాయిప‌ల్ల‌వికి కూడా ఆటోతో లింక్ ఉంది. ఈ భామ ఇప్పుడు ఆటో నేర్చుకుంటుంది. ప్ర‌స్తుతం ఈమె మారి 2లో ధ‌నుష్ తో రొమాన్స్ చేస్తుంది. ఇందులో ఆటోడ్రైవ‌ర్ గా న‌టించ‌బోతుంది ఈ ముద్దుగుమ్మ‌. దాంతో డ్రైవింగ్ నేర్చుకుంటుంది ప‌ల్ల‌వి. గ‌తంలో ఫిదా కోసం ట్రాక్ట‌ర్ కూడా నేర్చుకుంది సాయిప‌ల్లవి. ఇలా మొత్తానికి స‌మంత ఆటో ఎక్కితే.. సాయిప‌ల్ల‌వి ఏకంగా ఎలా న‌డ‌పాలో నేర్చుకుంటుందన్న‌మాట‌.

User Comments