ఆటో రాణిగా సాయిప‌ల్ల‌వి

Last Updated on by

కెరీర్ ఆరంభ‌మే ప్రేమ‌మ్‌, ఫిదా చిత్రాల‌తో బంప‌ర్ హిట్లు కొట్టింది సాయి ప‌ల్ల‌వి. ఈ అమ్మ‌డి కోస‌మే కొన్ని జాన‌ర్లు పుడ‌తాయ‌ని ప్రూవ్ చేసింది. న‌వ‌త‌రం నాయిక‌ల్లో చ‌క్క‌ని ప్ర‌తిభావ‌నిగా యువ‌త‌ గుండెల్లో నిలిచిపోయింది. ఫిదాలో నైజాం యాస‌కు త‌గ్గ‌ట్టు సాయి ప‌ల్ల‌వి అభిన‌యం ఆక‌ట్టుకుంది. ప్ర‌తిసారీ ఏదో ఒక కొత్త‌ద‌నం కోరుకునే సాయి ప‌ల్ల‌వి ఇటీవ‌లే క‌ణం (కారు) చిత్రంతో తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల్ని మెప్పించింది. సినిమా జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ మ‌ల‌బారు భామ‌.

తాజాగా ఈ మ‌ల్లూ భామ మ‌రో ప్ర‌యోగాత్మ‌క పాత్ర‌లో న‌టిస్తోంది. త‌మిళంలో ధ‌నుష్ క‌థానాయ‌కుడిగా తెర‌కెక్కుతున్న `మారి 2` చిత్రంలో సాయి ప‌ల్ల‌వి ఆటో క్వీన్‌గా న‌టించ‌నుంద‌ని తెలుస్తోంది. అందుకోసం ఇప్ప‌టికే ఆటో న‌డ‌ప‌డం ప్రాక్టీస్ చేస్తోందిట‌. వాస్త‌వానికి `మారి-1`లో అందాల కాజ‌ల్ క‌థానాయిక‌గా న‌టించింది. పార్ట్ -2లో ఫిదా బ్యూటీ ఎలా సెట్ట‌వుతుంది? అన్న సందేహం ఉండేది. ఇప్పుడు ఆ సందేహం తీరిపోయిన‌ట్ట‌యింది. సాయి ప‌ల్ల‌వి పాత్ర కాజ‌ల్ పాత్ర‌తో పోలిస్తే పూర్తి విభిన్నంగా ఉంటుంద‌ని అర్థ‌మ‌వుతోంది. పెద్ద తెర‌పై మ‌రో ప్ర‌యోగాత్మ‌క పాత్ర‌లో న‌టించే అవ‌కాశం అందుకున్న సాయి ప‌ల్ల‌వి మ‌రోసారి అభిమానుల‌కు స‌ర్‌ప్రైజ్ ఇవ్వ‌బోతోందన్నమాట‌! ఇందుకోసం మూడు చ‌క్రాల బండిని ఎలా న‌డుపుతుందో కాస్త వేచి చూడాల్సిందే.

User Comments