Last Updated on by
ఏ హీరోయిన్ కలలో కూడా ఊహించని డెబ్యూ ఇది. తొలి సినిమాతోనే పది సినిమాల రేంజ్ లో గుర్తింపు తెచ్చుకోవడం అంటే మాటలు కాదు. అది ఎవరికో ఒక్కరికి గానీ జరగదు. అలాంటి వింత సాయిపల్లవికి జరిగింది. ఈ భామ తొలి సినిమాలే చరిత్ర సృష్టించాయి. మళయాలంలో ప్రేమమ్ తో ఇండస్ట్రీకి వచ్చిన సాయి.. ఆ తర్వాత తెలుగులో ఫిదాతో అందర్నీ ఫిదా చేసింది. ఇక ఇప్పుడు తెలుగులో ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ సొంతం చేసుకుంది సాయిపల్లవి. ఇందులో ఓ అద్బుతం కూడా ఉంది. ఎందుకంటే అడుగు పెట్టిన ప్రతిచోటా అవార్డులన్నీ సాయిపల్లవికే వస్తున్నాయి.
తొలి సినిమా ప్రేమమ్ టైం లో కూడా ఆ ఏడాది అన్ని అవార్డులు ఈ ముద్దుగుమ్మకే వచ్చాయి. కేరళ ప్రభుత్వం ఇచ్చే అవార్డ్.. బిహైండ్ వుడ్ అవార్డ్.. ఫిల్మ్ ఫేర్.. ఇలా అన్నీ సాయిపల్లవికే వెళ్ళిపోయాయి. ఇక ఇప్పుడు ఫిదాకు మొదలయ్యాయి. ఈ చిత్రంలో నటనకు గానూ ఇప్పుడు ఫిల్మ్ ఫేర్ సొంతం చేసుకుంది పల్లవి. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ చిత్రం కేవలం సాయిపల్లవి నటనతోనే అంత పెద్ద విజయం సాధించిందంటే అతిశయోక్తి కాదు. ఆ సినిమా తర్వాతే తెలుగులోనూ స్టార్ అయింది సాయిపల్లవి. ఇప్పటికి ఒక్క ఫిల్మ్ ఫేర్ మాత్రమే వరించింది. చూడాలి.. ఇంకా సాయిపల్లవికి ఎన్ని అవార్డులు వస్తాయో..?
User Comments