ఈ క‌ణం ఇప్పుడొచ్చి ఏం లాభం..?

Last Updated on by

ఎప్పుడో గ‌తేడాది రావాల్సిన సినిమా.. ఆ త‌ర్వాత జ‌న‌వ‌రి అన్నారు కాదు ఫిబ్ర‌వ‌రిలో వ‌స్తాం అన్నారు.. అది కాదు మార్చ్ 23 అన్నారు.. అన్నీ పోయి ఇప్పుడు ఏప్రిల్ 27న వ‌స్తామ‌ని కొత్త తేదీ ప్ర‌క‌టించారు. మ‌నం మాట్లాడుకుంటున్న‌ది క‌ణం సినిమా గురించే. నాగ‌శౌర్య‌, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన ఈ చిత్రానికి ఏఎల్ విజ‌య్ ద‌ర్శ‌కుడు. ఈయ‌న తెర‌కెక్కించిన ఈ చిత్రం బ్రూణ‌హ‌త్య‌లు నేప‌థ్యంలో తెర‌కెక్కింది. సాయిప‌ల్ల‌వి హీరోయిన్ కావ‌డంతో ఈ సినిమాపై అప్ప‌ట్లో అంచ‌నాలు భారీగా ఉన్నాయి. కానీ ఇప్పుడు అన్ని అంచ‌నాలు కానీ ఆస‌క్తి కానీ ప్రేక్ష‌కుల్లో క‌నిపించ‌ట్లేదు. క‌ణం సినిమా వ‌స్తుందంటే కూడా ప‌ట్టించుకోవ‌డం లేదు. కాలా విడుద‌ల తేదీ వాయిదా ప‌డ‌టంతో ఏప్రిల్ 27న క‌ణం సినిమా వ‌స్తుంది. సాయిప‌ల్ల‌వితో ఉన్న వివాదం కార‌ణంగా ఎలాగూ ఈ చిత్రాన్ని ప‌ట్టించుకోవ‌ట్లేదు నాగ‌శౌర్య‌. దాంతో ప‌ల్ల‌వి మాత్ర‌మే క‌ణం ప్ర‌మోష‌న్ లో ఉంది. ఈమె విజ‌యాలు.. నాగ‌శౌర్య‌కు కూడా ఛ‌లో బ్లాక్ బ‌స్ట‌ర్ కావ‌డంతో క‌ణం కాస్త అటెన్ష‌న్ క్రియేట్ చేస్తుంది. మ‌రి చూడాలిక‌.. ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భ‌ర‌త్ అనే నేను దూకుడు ఎంత‌వ‌ర‌కు త‌గ్గిస్తుందో..?

User Comments