వాళ్లకు నో చెప్పి.. మెప్పించిన సాయి పల్లవి 

మలయాళం నేచురల్ బ్యూటీ సాయి పల్లవి.. టాలీవుడ్ లో ఒకటే పీస్ అంటూ ఫిదా సినిమాతో మస్త్ పాపులర్ అయింది.  ఈ సినిమా కోసం ఆమె పడ్డ శ్రమ ఒక్క పీస్ కూడా వృధా కాలేదనే చెప్పాలి.  సినిమా సూపర్ హిట్ అయింది.  ఇంకేముంది.. అందరూ అబ్బో సూపర్, సాయి పల్లవి కిరాక్ అన్నారు. దాంతో ఇక సాయి పల్లవికి డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో  సాయి పల్లవి కళ్ళు నెత్తికి ఎక్కుతాయని అంటా అనుకున్నారు.  కానీ అలా కాలేదు.  ఈ అమ్మడు నేలమీదనే ఉన్నది. ఇక, సినిమా హిట్ కావడంతో అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి.  ఈ అవకాశాలు వస్తున్నాయి కానీ, తనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు రావడం లేదని.. దీంతో మంచి పాత్ర దొరికినపుడు తప్పకుండా చేస్తానని అంటోంది.
మరోవైపు సాయి పల్లవి బ్రాండ్ ను ఉపయోగించుకోవాలని చాలా మంది షో రూమ్ ఓపెనింగ్ కోసం, మొబైల్ షాప్ ఓపెనింగ్ కోసం పిలుస్తున్నారట.  పల్లవి అందుకు ఒప్పుకోవడం లేదట.  కారణం లేకపోలేదు. తనకు ఇలాంటివి ఇష్టం ఉండవని..  చారిటి కార్యక్రమాలంటే ఇష్టం అని చెప్తోంది ఫిదా భామ.  సహాయం చేయడం అన్నా.. సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలన్న తప్పకుండా వస్తానని.. వాటిలో పార్టిసిపేట్ చేసేందుకు ఎటువంటి అభ్యంతరం లేదని అంటోంది.  ఒక్క సినిమా హిట్ అయితే, ఆ హిట్ తాలూకు ఫలితాలను ఎంజాయ్ చేస్తూ రెండు చేతులా సంపాదించుకోవాలి అనుకునేవారున్నా ఈ రోజుల్లో ఇలా ఆలోచించడం గ్రేట్ కదా. ఏదిఏమైనా, షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ రానని చెప్పి వాళ్లకు నో చెప్పినా.. తన మాటలతో మాత్రం సాయి పల్లవి మెప్పించిందనే అనాలి.