సాయి పల్లవిని 3 సినిమాలకు బుక్ చేసిన నిర్మాత 

sai pallavi three movies commitment dil raju

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్లలో ఒకరిగా వెలుగొందుతున్న దిల్ రాజు సినిమాల ప్లానింగ్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ముఖ్యంగా టాలెంటెడ్ డైరెక్టర్లను, ఆర్టిస్టులను సింగిల్ పేమెంట్ లతో రెండు మూడు సినిమాలకు మాట్లాడుకుని.. క్రేజీ ప్రాజెక్టులను సెట్ చేయడంలో దిల్ రాజుది అందెవేసిన చెయ్యి అని ఇప్పటికే చాలాసార్లు చెప్పుకున్నాం. ఇక ఇప్పుడు అదే తరహాలో మలయాళం ప్రేమమ్ బ్యూటీ సాయి పల్లవిని కూడా 3 సినిమాలకు ఒకేసారి నిర్మాత దిల్ రాజు బుక్ చేసుకున్నారని తెలియడం విశేషం. ఆ స్టోరీలోకి వెళితే, దిల్ రాజు లేటెస్ట్ మూవీ వరుణ్ తేజ్ ‘ఫిదా’ తో సాయి పల్లవి తెలుగు తెరకు పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు ఈ ఒక్క సినిమా కోసమే సాయి పల్లవిని దిల్ రాజు తీసుకురాలేదని తెలియడం గమనార్హం. అంటే, తీసుకొచ్చినప్పుడే తన టాలెంట్ తో సాయి పల్లవితో ఏకంగా 3 సినిమాలకు దిల్ రాజు అగ్రిమెంట్ కుదుర్చుకున్నారట.
దానికోసం ఒకేసారి సింగిల్ పేమెంట్ ఇచ్చేశారని తెలుస్తుండంతోనే దిల్ రాజు బ్రెయిన్ ఏ రేంజ్ లో పనిచేస్తుందో అర్థమవుతుంది. ఇకపోతే, 3 సినిమాలకు ఒప్పందం చేసుకున్న సాయి పల్లవి ఇప్పటికే ఫిదా ను పూర్తి చేయగా.. ఇప్పుడు దిల్ రాజు బ్యానర్ లోనే నాని హీరోగా తెరకెక్కుతున్న ‘ఎంసీఏ’ సినిమాలో కూడా హీరోయిన్ గా నటించటానికి రెడీ అవుతుంది. దీని తర్వాత వెంటనే పెద్దగా గ్యాప్ తీసుకోకుండా దిల్ రాజు బ్యానర్ లోనే సాయి పల్లవి మూడో సినిమా కూడా చేసేయనుందట. అయితే, ఆ మూడో సినిమా ప్రస్తుతానికి సప్సెన్స్ డ్రామాలో ఉందని సమాచారం. దానికి కారణం ఇప్పుడు దిల్ రాజు బ్యాచ్ లో డైరెక్టర్స్ సతీష్ వేగ్నేశ, శ్రీకాంత్ అడ్డాల, దశరథ్ లు స్క్రిప్ట్ లతో రెడీగా ఉండటమేనని తెలుస్తోంది. దీని ప్రకారం ఈ ప్రాజెక్టుల్లో ఏదో ఒక దానిలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించే ఛాన్స్ ఉందని అంటున్నారు. దాంతో ఈ మలార్ టీచర్ అగ్రిమెంట్ పూర్తవుతుందని సమాచారం. మరి ఈ లెక్కన దిల్ రాజు ప్లానింగ్ ను మెచ్చుకోవాల్సిందే.