ఫ్రాన్స్‌లో మెగా హీరో సీక్రెట్ గేమ్స్‌

Last Updated on by

అసాధార‌ణ డ్యాన్సింగ్ స్కిల్‌తో సుప్రీం హీరోగా పిలిపించుకున్న మెగా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్‌. మేన‌మామ మెగాస్టార్‌ పోలిక‌ల‌తో దూసుకొచ్చిన ఈ యువ‌తేజం ఆరంభం ఘ‌నంగానే ఉన్నా మ‌ధ్య‌లో కాస్తంత త‌ప్ప‌ట‌డుగులు వేశాడ‌న్న‌ది నిజం. కెరీర్ ప‌రంగా ప్ర‌స్తుతం ఒడిదుడుకుల్లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే రిలీజైన జ‌వాన్‌, ఇంటెలిజెంట్ బాక్సాఫీస్ వ‌ద్ద ఆశించిన ఫ‌లితం ఇవ్వ‌క‌పోవ‌డం నిరాశ‌ప‌రిచింది. ఆ క్ర‌మంలోనే ఎట్టి ప‌రిస్థితిలో హిట్ కొట్టాల‌న్న క‌సితో మావ‌య్య ప‌వ‌న్‌కి `తొలి ప్రేమ‌` లాంటి సంచ‌ల‌న విజ‌యాన్ని ఇచ్చిన క‌రుణాక‌ర‌న్‌తో జోడీ క‌ట్టాడు.
ప్ర‌స్తుతం ఈ కాంబినేష‌న్‌లో `తేజ్‌.. ఐ ల‌వ్ యు` శ‌ర‌వేగంగా తెర‌కెక్కుతోంది. ఇప్ప‌టికే హైద‌రాబాద్ సార‌థి స్టూడియోస్‌లో షెడ్యూల్ పూర్త‌యింది. త‌దుప‌రి ఈనెల 28 నుంచి ఫ్రాన్స్ లో పాట‌ల చిత్రీక‌ర‌ణ‌ ప్రారంభం కానుంది. తేజ్ & టీమ్ ఫ్రాన్స్‌కి జంప్ అయ్యేందుకు ప్రిప‌రేష‌న్స్‌లో ఉన్నార‌ని తెలుస్తోంది. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో ప‌లువురు సీనియ‌ర్ న‌టీన‌టులు న‌టిస్తున్నారు. కె.ఎస్‌.రామారావు వంటి స్టార్ ప్రొడ్యూస‌ర్ సార‌థ్యంలో తెర‌కెక్కుతున్న సినిమాగా తేజ్ సినిమాకి క్రేజు ఉంది. ఈ సినిమాతో ఒకే దెబ్బ‌కు రెండు పిట్ట‌లు అన్న చందంగా అటు సాయిధ‌ర‌మ్‌, ఇటు క‌రుణాక‌ర‌న్ ఇద్ద‌రూ స‌క్సెస్‌ ట్రాక్‌లోకి రావాల్సి ఉంటుంది. అందుకే ఈ ప్రాజెక్ట్ ఆ ఇద్ద‌రికీ ఛాలెంజింగ్‌.

User Comments