తేజ్‌-అనుప‌మ‌పై డౌట్‌?

Last Updated on by

రీల్ ల‌వ్ వేరు. రియ‌ల్ ల‌వ్ వేరే! ఆ రెండోదాంట్లో మెగా మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ ఎక్స్‌ప‌ర్ట్‌. ఇప్ప‌టికే అత‌డు మీన‌నేత్రి రెజీనాతో ల‌వ్‌లో ప‌డ్డాడు. ఆ ఇద్ద‌రి ప్రేమ గురించి ఇండ‌స్ట్రీలో నానా ర‌చ్చ సాగింది. అయితే ఎందుక‌నో మ‌ధ్య‌లోనే ల‌వ్ బ్రేక‌ప్ అయ్యింది. దాంతో తీవ్ర నిరాశ‌లో కూరుకుపోయిన రెజీన.. ప్రియుడు సాయిధ‌ర‌మ్‌పై కారాలు మిరియాలు నూరింది. ప‌లు ఇంట‌ర్వ్యూల్లో తేజ్ మోసం చేశాడ‌ని ఎమోషన్ అయ్యింద‌న్న‌ ప్ర‌చారం సాగింది. ఇక‌పోతే తేజ్ అనుప‌మ‌తో రియ‌ల్ ల‌వ్ మొద‌లెట్టాడా? అంటూ మ‌రో రౌండ్ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

వాయ్యో సుప్రీంహీరో .. నీలో చాలా ఉంద‌య్యో..అన్న సందేహాల్ని ఫ్యాన్స్ వ్య‌క్తం చేస్తున్నారు. అయితే అందుకు కార‌ణం లేక‌పోలేదు. తేజ్ – అనుప‌మ రియ‌ల్‌ ప్రేమికులేన‌ని సందేహించాన‌ని స్వ‌యంగా పెద్దాయ‌న కె.ఎస్‌. రామారావు గారే అన‌డంతో అంద‌రిలోనూ ప‌లు సందేహాలు రేకెత్తాయి. ఏపీ ఫిలింఛాంబ‌ర్‌లో తేజ్‌.. నిర్మాత కె.ఎస్‌.రామారావు ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ ఆ ఇద్ద‌రిపైనా డౌట్స్ ఉన్నాయ్‌! అని వ్యాఖ్యానించారు. తేజ్ – అనుప‌మ వ్య‌వ‌హారంపై ఆయ‌న చేసిన ఈ వ్యాఖ్య ఇత‌రుల్లోనూ సందేహం రాజేసింది. అయితే ఆ ఇద్ద‌రి కెమిస్ట్రీ తెర‌పై అలా పండిందని అనుకోవాలా? లేదూ తెర‌వెన‌క కెమిస్ట్రీ పండ‌డం వ‌ల్ల అలా కుదిరింద‌నుకోవాలా? అంటూ ఒక‌టే ముచ్చ‌టించుకున్నారంతా. ఇంత‌కీ తేజ్ ల‌వ్‌లో అనుప‌మ అని క‌న్ఫామ్ అయిపోవాల్సిందేనా?

User Comments