స‌క్సెస్ లో ఉన్నా `చిత్ర‌ల‌హ‌రి`కి ఓకే!

సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వ ంలో మైత్రి మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మించిన చిత్ర‌ల‌హ‌రి ఏప్రిల్ 12న విడుద‌ల‌వుతోంది. ఈ సందర్భ ంగా హైద‌రాబాద్ లో సాయిధ‌ర‌మ్ తేజ్ మీడియాతో ముచ్చ‌టించారు. త‌న‌పేరులో ధ‌ర‌మ్ తొల‌గించ‌డానికి కార‌ణంతో పాటు సినిమా సంగ‌తుల్ని సాయిధ‌ర‌మ్ వివ‌రించారు.

*సాయితేజ్‌గారు ముందుగా మీ పేరు నుంచి సాయిధ‌ర‌మ్‌తేజ్ తొల‌గించారు ఏదైనా న్యూమ‌రాల‌జీ ప్ర‌కార‌మా ఏదైనా జ్యోతిష్య‌మా?

లేదండీ. సినిమా కొద్దిగా మంచి సినిమా క‌దా కూల్‌గా వెళ‌దామ‌ని హాయిగా ప్ర‌శాంతంగా అంతే అది నా పేరు కాబ‌ట్టి నాతోనే ఉంటుంది.

*మాములుగా అన్నీ ఫెయిల్ అయి లాస్ట్ హీరోలా చూపిస్తారు.. అది క‌మ‌ర్షియల్.. ఈ సినిమా స్పెషాలిటీ ఏమిటి?

బేసిక్‌గా విజ‌య్‌కృష్ణ క్యారెక్ట‌ర్ త‌న జీవితంలో ఎప్పుడూ స‌క్సెస్ చూడ‌లేదు. స‌క్సెస్ అంటే ఏంటి అన్న‌ది తెలియ‌దు. స‌క్సెస్ చూస్తే ఎలా ఉంటుంది అన్న‌ది కూడా తెలియ‌దు. బేసిక్‌గా నేను ఎల‌క్ట్రిక‌ల్ ఇంజ‌నీర్ ఏదో ఒక‌టి సాధించాల‌న్న గోల్ ఉంట‌ది.

*మీకు స‌క్సెస్‌లేదు కిశోర్‌కి కూడా స‌క్సెస్‌లేదు ఈ స‌మ‌యంలో ఆయ‌న‌తో చేయ‌డం ఎంత వ‌ర‌కు క‌రెక్ట్‌?

బేసిక్‌గా కంటెంట్ బావుంటే స‌క్సెస్ ఎప్పుడైనా వ‌స్తుంది. ప్ర‌తి యాక్ట‌ర్‌కి త‌న‌ను త‌ను ప్రూవ్ చేసుకోడానికి ఒక ఛాన్స్ వ‌స్తుంది. ఫెయిల్యూర్‌తో ఆగిపోతారు అన్న ఫీలింగ్ ఎప్పుడూ లేదు.

*ఇన్ని సినిమాలు చేయ‌డంతో మీకు ఏదైనా క‌థ‌లు ఎన్నుకోవ‌డం తేడా క‌నిపిస్తుందా?

ఈ క‌థ చేస్తాను ఇది చెయ్య‌ను అని చెప్ప‌గ‌లిగే ధైర్యం వ‌చ్చింది. నేను గ‌తంలో న‌టించిన 6 చిత్రాల నుంచి నేను నేర్చుకున్న‌ది వంద‌శాతం నాకు న‌చ్చితేనే చేస్తున్నాను. లేదంటే లేద‌ని చెప్పేస్తున్నాను. ఇంక‌ముందు కూడా అలాగే చేస్తాను.

*ఇప్ప‌టివ‌ర‌కు చేసిన చిత్రాలు మొహ‌మాటం కోసం ఒప్పుకున్నారా?

కాదండి. ఒక క‌మిట్‌మెంట్ ఉంటుంది. మాట ఇచ్చాను కాబ‌ట్టి చేశాను. నేను ఒక‌సారి మాట ఇస్తే ఇక అంతే
కంప‌ల్‌స‌రీ చేస్తా.

*ఎటువంటి సినిమాలు అలా క‌మిట‌య్యారు?

గ‌తంలో చేసిన ఆరు చిత్రాలు అంతే. క‌థ విని చేశాను. కాని నేరేట్ చేసేట‌ప్పుడు ఎక్క‌డికో వెళుతుంది అని అనిపించినా కానీ ఛాయిస్ లేదు. నేను చేసేశాను.

*కిశోర్ తిరుమ‌ల ఎలా క‌థ గురించి బ్రీఫ్‌గా చెప్పారా?

ఒక క‌థ లా విను అని చెప్పారు. చిత్ర‌ల‌హ‌రి టైటిల్ అని మొద‌టి నుంచి చెప్పారు. ఐదు పాత్ర‌లు ఒక లైఫ్‌ని ఎలా ఇన్‌ఫ్లూయ‌న్స్ చేసింది. అప్ప‌ట్లో చిత్ర‌ల‌హ‌రి ప్ర‌తి శుక్ర‌వారం ఎలా ఇన్‌ఫ్లూయ‌న్స్ చేసింది అన్న‌దానిబ‌ట్టి. చిత్ర‌ల‌హ‌రి ప్రోగ్రామ్ కోసం జ‌నం ఎదురు చూస్తూ ఉండేవారు. అలా ఉంటుంది.

*ఒక క‌థ వ‌న్న‌ప్పుడు రాంగ్‌వేలో వెళుతుంది అని తెలుస్తుంది అన్నారు క‌దా అప్పుడు న‌టించ‌డం క‌ష్టం అనిపించ‌దా?

ఫేట్. అనేది ఒక న‌మ్మ‌కంతో వెళ‌తాము. ఎలాగైనా స‌క్సెస్ అవుతుంది అన్న న‌మ్మ‌కం.ఇంక నెగిటివ్ ఆలోచ‌న‌లు అనేవి అస‌లు రావు. నేను చేసే పాత్ర‌కి న్యాయం చేశానా. ప్రొడ్యూస‌ర్‌ని ఎక్కువ‌గా క‌ష్ట‌పెట్ట‌లేదు క‌దా. డైరెక్ట‌ర్ ఎలా చెప్పారు ఏం చేస్తున్నాను అంత‌వ‌ర‌కే చూస్తా.

*క‌థ వినేట‌ప్పుడు మీ ఇన్‌వాల్వ్‌మెంట్ ఎంత వ‌ర‌కు?

క‌థ వింటాను. ఏదైనా డ‌వుట్లు ఉంటే అడుగుతాను అంతే మార్పులు ఏం చెప్ప‌ను. నాకు ఈ మార్పు కావాలి అది కావాలి ఇవ‌న్నీ ఏమీ చెప్ప‌ను. నాకు ఇది సూట్ అవ్వ‌దు ఏం చెప్ప‌ను. ఆన్‌లొకేష‌న్ కూడా చెప్ప‌ను.

*ఇప్పుడు మార్పులు చెపుతారా గ‌త అనుభ‌వాన్ని బ‌ట్టి?

నేను ఎవ‌రైనా మ‌న‌కు ఒక క‌థ చెపుతున్నారంటే వాళ్ళు మ‌న‌ల్ని ఎంతో ప్రేమించి క‌థ చెపుతున్నార‌ని న‌మ్ముతాను. నేను కేవ‌లం క‌థ విని చేస్తానా చెయ్య‌నా అంత వ‌ర‌కే చెపుతాను అది ఎంత వ‌ర‌కు క‌రెక్ట్ అన్న‌ది నాకు తెలియ‌దు కాని నాకు న‌చ్చిందంటే నేను చేస్తా. న‌చ్చలేదంటే చెయ్య‌ను. బావుందా బాలేదా అంటే నేను చెప్ప‌లేను.

*చిత్ర‌ల‌హ‌రి క‌థ విష‌యంలో ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు?

ప్ర‌త్యేకించి జాగ్ర‌త్త‌లు ఏమీ తీసుకోలేదు. ప‌ర్స‌న‌ల్లీ నేను క‌థ కి బాగా క‌నెక్ట్ అయ్యాను. క‌థ విన్న‌వెంట‌నే సినిమా వదులుకోకూడ‌దు చెయ్యాలి అనిపించింది.

*ప‌ద్నాలుగేళ్ళ నుంచి కిషోర్ మీకు తెలుసు.. మ‌రి ఇంత గ్యాప్‌లో సినిమా చేస్తున్నారు?

ప‌ద్నాలుగు కాదు ప‌ద‌కొండేళ్ళు. అంతే ప్ర‌త్యేకించి ఏమీ కార‌ణం లేదు. కుద‌ర‌లేదు అంతే. ఫస్ట్‌టైమ్ క‌థ రాసిన‌ప్పుడు సెకండ్ అనే సినిమా ఒక‌టి తీశారు. అది బావుంది. త‌ర్వాత రామ్‌తో నేను శైల‌జా తీశారు. ఒక ఫ్రెండ్‌గా నేను చాలా హ్యాపీ ఫీల‌య్యాను. గ‌ర్వ‌ప‌డ్డాను మంచి సినిమా తీసినందుకు త‌నకు కూడా చెప్పాను. ఒక ఫ్రెండ్‌లాగా త‌న ఎదుగుద‌ల‌ను ఆనందించాను. ప్ర‌త్యేకించి నేను ఎప్పుడూ వెళ్ళి నాకోసం సినిమా చెయ్యి అని అడ‌గ‌లేదు.

*కెరీర్ వైజ్‌గా కొంత మంది సోష‌ల్ మీడియాలో వాళ్ళు వాళ్ళ బ‌యోపిక్‌లా ఫీల‌వుతున్నారు దాని గురించి?

అవునండీ ట్విట్ట‌ర్‌లో చూస్తున్నాను. వాళ్ళు దేనికి క‌రెక్ట్ అయ్యారో నాకు తెలియ‌దు కాని. ఏదో సాధించాం అని అనుకుంటారు. నేను ఈ సినిమా అది అలా ఉండిఉంట‌ది. ఆ మెసేజ్ ఉంటుంది.

*ఫైన‌ల్‌గా సినిమా చూశారా?
చూడ‌లేదు. డ‌బ్బింగ్ అవ్వ‌క‌ముందు చూశా.

*మైత్రీ మూవీస్ గురించి? మీ త‌మ్ముడిని ఇంట్ర‌డ్యూస్ చెయ్య‌డం గురించి?

నాకు సంబంధం లేదండి. వాళ్ళు డైరెక్ట‌ర్‌గా ఎప్రోచ్ అయ్యారు. మైత్రీ వాళ్ళు నా ఆరు చిత్రాలు చూసి కూడా నాకు ఛాన్స్ ఇచ్చారు. నేను చాలా సంతోషం. సినిమాని వాళ్ళు ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా డైరెక్ట‌ర్‌కి, కెమెరామెన్‌కి ఏం కావాలో అన్నీ స‌మ‌కూర్చారు.ఆర్టిస్ట్‌ల‌ను కూడా చాలా కంఫ‌ర్ట్‌బుల్‌గా చూశారు. నేను చాలా ల‌క్కీ మైత్రీవాళ్ళ‌తో చెయ్యడం అన్నారు. ఇండ‌స్ట్రీకి ఇలాంటి ప్రొడ్యూస‌ర్స్ ఉండాలి.

*దేవిశ్రీ మ్యూజిక్ గురించి?

దేవి అన్న మ్యూజిక్ సూప‌ర్బ్‌.నేను చాలా ల‌క్కీ త‌న‌తో క‌ల‌వ‌డం. నాకు త‌న సాంగ్స్ అన్నీ ఇష్టం. మొద‌టి నుంచి త‌న సాంగ్స్ అన్నీ క‌లెక్ట్ చేసి ఉంచుతాను. క్యాసెట్స్ అన్నీ ఉన్నాయి. నేను మొద‌టి నుంచి ఆయ‌న మ్యూజిక్‌ని ఫాలోఅవుతాను. సాంగ్స్ చాలా ఎంజాయ్ చేసేవాడ్ని. నేను ఎప్పుడూ అనుకోలేదు త‌న‌తో ప‌ని చేస్తాను అని. అలాగే మా అమ్మ‌గారి కోరిక కూడా నువ్వు దేవి మ్యూజిక్‌కి డ్యాన్స్ చేస్తే చూడాల‌ని ఉంది అని అనేవారు. అలా కుదిరింది.

*ప్రీరిలీజ్‌లో అన్నారు కొందరు సుకుమార్, కొర‌టాల లాంటి డైరెక్ట‌ర్లు స‌పోర్ట్ చేశార‌ని?

అది కిశోర్‌ని అడ‌గాలి న‌న్నుకాదు. బ‌ట్ క‌థ విన్న ద‌గ్గ‌ర నుంచి కొర‌టాల‌గారు మాత్రం ఫుల్ స‌పోర్ట్ చేశారు. నాకు కిశోర్ చెపుతూ ఉన్నారు. ఈ సినిమాలో చేసిన ప్ర‌తి ఒక్క‌రం స‌క్సెస్ కోసం ఎదురు చూస్తున్నాం.

*మీ గ్లాస్‌మేట్ సునీల్ గురించి?

సునీల్ అన్న‌తో వ‌ర్క్ చెయ్య‌డం నా డ్రీమ్‌. ఆయ‌న సినిమాలు నువ్వే కావాలి, నువ్వునేను చూసి ఒక‌సారైనా యాక్ట్ చెయ్యాలి అనుకున్నా. నేను వ‌చ్చేస‌రికి ఆయ‌న హీరో అయిపోయారు. ఇంక కుద‌ర‌దు అనుకున్నా కాని కుదిరింది. సునీల్ అన్న‌కి చాలా థ్యాంక్స్‌. ఎందుకంటే ఆయ‌న ఒప్పుకుని మంచి పాత్ర‌ని చేసినందుకు. ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే ఆఫ్‌స్రీన్ త‌ను నాకు బ్ర‌ద‌ర్ లాంటివారు. త‌మ్ముడు త‌మ్ముడు అని పిలుస్తారు. ఆ బాండింగ్ బాగా క‌నెక్ట్ అయింది.

*రియ‌ల్ లైఫ్‌లో గ్లాస్‌మేట్సేనా?

ఓన్సీ ఛాయ్ గ్లాస్‌మేట్స్‌. మందు త‌క్కువే నేను ఎక్కువ‌గా తాగ‌ను ఏద‌నా అకేష‌న్‌లో జ‌స్ట్ కొంచం అంతే. నాబ‌ర్త్‌డే, న్యూయ‌ర్ అలా.

*ఇద్ద‌రు హీరోయిన్స్ ఎలా చేశారు?

ఇద్ద‌రు మంచి పెర్ఫామ‌ర్స్‌. చాలా బాగా చేశారు. సీన్స్ చేసేట‌ప్పుడు ఇద్ద‌రితో ఒక చిన్న ఎగ్జైట్‌మెంట్ ఉండింది. వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు నేను ఎలా రెస్పాండ్ కావాలి. అని బ‌ట్ ఒక కాంపిటేష‌న్ అని కాదు రాని హెల్దీ కాంపిటేష‌న్ టైప్‌లో ఉంటుంది.

*గ్లాస్‌మేట్స్ అనే సాంగ్‌ ఎలా వ‌చ్చింది? క‌థ‌లోంచా ఎలా?

ఫిబ్ర‌వ‌రిలో నాకు క‌థ చెప్పిన‌ప్పుడే సాంగ్ గురించి చెప్పారు. నేను కూడా అనుకోలేదు. డిసెంబ‌ర్‌లో గ్లాస్‌మేట్స్ ఉంది గ్లాస్ వ‌స్తుంది అని బ‌ట్ మా అదృష్టం.

*కాలేజ్‌స్టూడెంట్‌, ల‌వ‌ర్‌బాయ్ క్యారెక్ట‌ర్స్ చెయ్య‌డంలేదు?

ప్ర‌త్యేకించి అలా ఏమీ లేదు. ఎటువంటి క్యారెక్ట‌ర్ వ‌స్తే అది చేస్తున్నాను. అంతే మంచి క‌థ అనిపిస్తే చేస్తా. ఇది కావాలి అని ఏమీలేదు. డెఫినెట్‌గా ఫ్యూచ‌ర్‌లో వస్తే చేస్తా.

*స‌క్సెస్ ఫెయిల్యూర్స్‌లో ఏదైనా తేడా చూశారా?
డెఫినెట్‌గా ఉంటుంది. స‌క్సెస్ ఉంటే గుంపు ఉంటుంది. ఫెయిల్యూర్ ఉంటే ఒక‌రు ఇద్ద‌రు ఉంటారు.

*మీ బ్ర‌ద‌ర్ వైష్ణ‌వ్ కి ఏం చెప్పాల‌నుకుంటున్నారు?
ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్‌. సినిమా రిలీజ్ టైంలో నాకు ఎలాగైతే ప్రేక్ష‌కులు బ్ల‌స్సింగ్స్ ఇచ్చారో వాడికి ఇవ్వాల‌ని ఆశిస్తున్నాను.కాని అది త‌న న‌ట‌న‌ని బట్టి ఉంటుంది.

*మీరు ఎలాంటి జాగ్ర‌త్త‌లు చెప్పారు?
నేను చెప్ప‌లేదండి. త‌ను నేర్చుకోవాలి. ప‌డాలి లెగాలి. ప‌ర్స‌న‌ల్‌గా ఎక్స్‌నీరియ‌న్స్ అవ్వాల‌ని.

*మామయ్య ప్ర‌చారానికి దూరంగా ఉన్నారు?

అవునండీ మామ‌య్య చెప్పారు. చేస్తే మూవీస్ చెయి లేదంటే పాలిటిక్స్‌లోకి రా అంతే కాని రెండు ప‌డ‌వ‌ల మీద కాళ్ళు వ‌ద్దు అన్నారు. బ‌ట్ మ‌ద్ద‌తు అయితే ఇస్తున్నాము. జ‌నాల‌కి స‌ర్వీస్ చెయ్యాలంటే చెయి డెడికేటెడ్‌గా ఉండాలి ఏదైనా అని అన్నారు.

*వైష్ణ‌వ్ సినిమా క‌థ విన్నారా?
విన్నానండి. నెక్స్ట్ విన‌మంటే వింటా. నేను ప్ర‌త్యేకించి ఛాయిస్ తీసుకోను వాడు నేర్చుకోవాలి.

*గ‌ల్లీ బోయ్ రీమేక్ లో న‌టిస్తున్నారా?
ఆ సినిమాయే చూడ‌లేదు. అవ‌న్నీ రూమ‌ర్స్. త‌దుప‌రి ఏ సినిమా క‌థా వినలేదింకా. వింటే చెబుతాను. మైత్రి సంస్థ గొప్ప‌ది. ఇలాంటి నిర్మాత‌లు వ‌రుస‌గా సినిమాలు తీయాల‌ని కోరుకుంటున్నాను.