బ‌న్నీతో లొల్లేం లేద‌న్న సాయిధ‌ర‌మ్!

గ‌తంలో ఓ సంద‌ర్భంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానులు అల్లు అర్జున్ ని ప‌వ‌న్ గురించి మాట్లాడాలి అంటూ ఒత్తిడి చేసిన నేప‌థ్యంలో చెప్ప‌ను బ్ర‌ద‌ర్ అంటూ బ‌న్నీ కామెంట్ చేసిన సంగ‌తి తెలిసిందే. అప్ప‌టి నుంచి ప‌వ‌ర్ స్టార్ అభిమానులు, స్టైలిష్ స్టార్ అభిమానుల మ‌ధ్య వైరం మొద‌లైంది. ఇద్ద‌రి హీరోల అభిమానులు సోష‌ల్ మీడియా వేదిక‌గా దూషించుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ కార‌ణంగా మెగా మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ , బ‌న్నీ మ‌ద్య విబేధాలు త‌లెత్తిన‌ట్లు ప్ర‌చారంలోకి వ‌చ్చింది. తాజాగా ఈ వివాదం పై సాయిద‌ర‌మ్ ఓ యూ ట్యూబ్ ఛాన‌ల్ కిచ్చిన ఇట‌ర్వూలో వివ‌ర‌ణ ఇచ్చాడు.

నేను మెగా హీరోల‌లో చ‌ర‌ణ్, వ‌రుణ్ ల‌తోనే క్లోజ్ గా ఉంటాను. బ‌న్నీని రేర్ గా క‌లుస్తుంటాను. అలా క‌లిసిన‌ప్పుడు స్టైలింగ్ గురించి ఎక్కువ‌గా డిస్క‌స్ చేసుకుంటాం. ఆయ‌న అభిప్రాయాలు ఆయ‌న‌వి. ఒక మ‌న‌సుడు ఆడియో వేడుక‌లో ఆయ‌న మాట్లాడింది అర్ధం కాక మౌనంగా ఉన్నానంతే త‌ప్ప మా ఇద్ద‌రి మ‌ధ్య ఎలాంటి మ‌నస్ప‌ర్ధ‌లు లేవ‌ని తెలిపాడు. మ‌రి ఇప్ప‌టికైనా మెగా అభిమానుల మ‌ధ్య ఆ అంత‌రం తొల‌గిపోతుందేమో చూద్దాం. ఇటీవ‌లే సాయిధ‌ర‌మ్ చిత్ర‌లహ‌రితో మంచి స‌క్సెస్ అందుకున్న సంగ‌తి తెలిసిందే.

Also Read:Frame To Frame Copied From Temper?