శైల‌జారెడ్డి అల్లుడేం చేస్తాడో?

Last Updated on by

అక్కినేని నాగ‌చైత‌న్య నిజ‌మైన స‌వ్య‌సాచిలా వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఒకేసారి రెండు సినిమాల్లో న‌టిస్తూ స‌వ్య‌సాచినే అని ప్రూవ్ చేస్తున్నాడు. ప్రేమ‌మ్ ఫేం చందు మొండేటితో స‌వ్య‌సాచి, మారుతి ద‌ర్శ‌క‌త్వంలో శైల‌జారెడ్డి అల్లుడు చిత్రాల్లో చైతూ న‌టిస్తున్నాడు. ఇవి రెండూ అత‌డి కెరీర్‌కి ఎంతో కీల‌కం. స‌వ్య‌సాచి చిత్రంతో మాస్ హీరోగా త‌న‌ని తాను ఎస్టాబ్లిష్ చేసుకునే ఆలోచ‌న‌లో ఉన్నాడు. ఈ సినిమా థ్రిల్‌కి గురి చేస్తూనే అదిరిపోయే యాక్ష‌న్‌తో మైమ‌రిపిస్తుందిట‌. వీఎఫ్ఎక్స్ ప‌నుల వ‌ల్ల ఈపాటికే రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం ఆగ‌ష్టుకి వాయిదా ప‌డింది. అలానే మారుతి ద‌ర్శ‌క‌త్వంలోని `శైల‌జారెడ్డి అల్లుడు` ఫ‌స్ట్‌లుక్ ఈవారంలో రిలీజ్ కానుంద‌ని తెలుస్తోంది.

ఇప్ప‌టికే వెబ్‌లో ఫేక్ ఫ‌స్ట్‌లుక్ హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. దీనిపై వివ‌ర‌ణ ఇచ్చిన ద‌ర్శ‌క‌నిర్మాత‌లు మారుతి& నాగ వంశీ ఈ వారంలోనే ఒరిజిన‌ల్ లుక్ రిలీజ్ చేస్తున్నామ‌ని తెలిపారు. కింగ్ నాగార్జునకు రొమాంటిక్ హీరోగా, రొమాంటిక్ అల్లుడిగా పేరుంది. అల్ల‌రి అల్లుడు సినిమా తెచ్చిన ఇమేజ్ అలాంటిది. నాగ్‌లా అంత కిక్కిస్తాడా చై? మారుతి ఆ రేంజును ట‌చ్ చేస్తాడా? అంటూ ఒక‌టే ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. కింగ్‌లోని మాసిజం, రొమాంటిక్ యాంగిల్‌ని చైతూ ఎంత‌వ‌ర‌కూ ఎలివేట్ చేయ‌గ‌ల‌డో ఈ రెండు సినిమాలు నిరూపించ‌నున్నాయి. కాస్త వేచి చూడాలి.

User Comments