ఇలా అయితే సామ్‌ కుళ్లుకు చావదా?

Last Updated on by

అక్కినేని హీరోల‌కు ఉన్న ట్యాగ్‌లైన్‌కి పూర్తి న్యాయం చేస్తున్నాడు నాగ‌చైత‌న్య‌. అక్కినేని హీరోలంటేనే రొమాంటిక్ హీరోలు అన్న పేరుంది. ఇప్పుడు ఆ లెగ‌సీని చైతూ ముందుకు తీసుకెళుతున్నాడు. ఏఎన్నార్‌, నాగార్జున రొమాంటిక్ హీరోలుగా ఓ వెలుగు వెలిగిన రోజుల్ని గుర్తు చేస్తున్నాడు. అత‌డు న‌టించిన `శైల‌జా రెడ్డి అల్లుడు` ఫోటోలు, సింగిల్ పాట‌లు ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తున్నాయి. ఇటీవ‌లే అనూ బేబి సాంగ్ యూట్యూబ్‌లో రిలీజైంది. ఈ పాట‌ అక్కినేని ఫ్యాన్స్‌ను ఓ రేంజులో ఖుషీ చేసింది. అనూ బేబిని టీజ్ చేస్తూ చైతూ ఆడిపాడిన తీరు మెప్పించింది. మునుముందు మ‌రిన్ని సింగిల్స్‌ని రిలీజ్ చేయ‌నున్నారు. శిల్ప‌క‌ళా వేదిక‌లో ఈ నెల 18న ఆడియో వేడుక‌ను ఘ‌నంగా నిర్వ‌హించ‌నున్నారు. ఈ వేడుక‌కు భారీగా అక్కినేని అభిమానులు త‌ర‌లిరానున్నార‌ని తెలుస్తోంది.

అంత‌కు ముందే శైల‌జారెడ్డి అల్లుడు స్టిల్స్ అంత‌ర్జాలంలో క‌న్నుల‌పండువ చేస్తున్నాయి. ప్ర‌స్తుతం యువ‌త‌రం వాట్సాప్‌ల‌లో జోరుగా వైర‌ల్ అవుతున్న ఈ రొమాంటిక్ స్టిల్స్‌ని వీక్షిస్తే .. చైతూ అనూ బేబితో ఓ రేంజులో రెచ్చిపోయి రొమాన్స్ చేశాడ‌ని అర్థ‌మ‌వుతోంది. అత్త కూతురితో అల్లుడి రొమాన్స్ అంటేనే వేడెక్కిస్తుంది. శైల‌జ కూతురితో చై రెచ్చిపోయిన తీరు యూత్‌కి పిచ్చెక్కిస్తోంది. ఇక ఫోటోల్లోనే ఇంత మ్యాట‌ర్ ఉంటే ఈ సాంగ్ విజువ‌ల్‌గా ఇంకెంత అందంగా ఉంటుందోన‌న్న ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఈనెల 31న ప్ర‌పంచ‌వ్యాప్తంగా శైల‌జారెడ్డి అల్లుడు థియేట‌ర్ల‌లోకి రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే.

User Comments