శైల‌జారెడ్డి అల్లుడు రిలీజ్ ఫిక్స్‌

Last Updated on by

టెంప‌రి అత్త‌కు త‌గ్గ తుంట‌రి అల్లుడుగా న‌టిస్తున్నాడు అక్కినేని నాగ‌చైత‌న్య‌. అత్తో అత్త‌మ్మ కూతురో.. ! అంటూ అత్త కూతురితో సాంగేసుకునే రొమాంటిక్ అల్లుడుగానూ మురిపించ‌బోతున్నాడు. ర‌మ్య‌కృష్ణ అలియాస్ శైల‌జారెడ్డి అత్త‌తో ఆడుకునే ద‌స‌రాబుల్లోడిగా క‌నిపించ‌బోతున్నాడు. మొత్తానికి శైల‌జారెడ్డి అల్లుడు అంత‌కంత‌కు వేడి పెంచుతున్నాడు. తాజాగా ఈ సినిమా రిలీజ్ తేదీని నాగ‌చైత‌న్య స్వ‌యంగా ప్ర‌క‌టించాడు. ఎస్‌.. ఆగ‌స్టు 31న వ‌చ్చేస్తున్నాం.. అంటూ సామాజిక మాధ్య‌మాల్లో అధికారికంగా తెలియ‌జేశాడు. ల‌వ్ ప్యాకేజీతో కూడుకున్న ఎమోష‌న‌ల్ జ‌ర్నీని తెర‌పై అందంగా, వినోదాత్మ‌కంగా చూపిస్తున్నారు మారుతి. ఎంట‌ర్‌టైన్‌మెంట్ పీక్స్ అంటూ కాన్ఫిడెంట్‌గా చెప్పాడు.

అదంతా స‌రే.. శైల‌జారెడ్డి అల్లుడు చిత్రంతో స‌వ్య‌సాచి పోటీప‌డే అవ‌కాశం ఉంద‌ని ఇదివ‌ర‌కూ వార్త‌లొచ్చాయి. దానిపై చై ఎలాంటి క్లారిటీ ఇవ్వ‌క‌పోవ‌డంతో ఆ సినిమా మ‌రో రెండు మూడు వారాల గ్యాప్ త‌ర్వాత వ‌స్తుంద‌ని అభిమానులు అంచ‌నా వేస్తున్నారు. ఇప్ప‌టికైతే స‌రిగ్గా నెలరోజుల్లో అల్లుడా మాజాకా లేదా అల్ల‌రి అల్లుడు సినిమాని చూడ‌బోతున్నామ‌ని జ‌నం ప్రిపేరైపోవాల్సిందే!!

User Comments