అత్తా-అల్లుడు రివెంజ్ అని ఫిక్స‌య్యారా?

Last Updated on by

శైలజా రెడ్డి అల్లుడు అన్న‌ టైటిల్ ప్ర‌క‌టించ‌గానే, ఇది అత్త- అల్లుడు సినిమా అని అందరూ ఫిక్స‌యిపోయారు. అత్త- అల్లుడు మధ్య జరిగే రివెంజ్ డ్రామా ఇది అన్న ప్ర‌చారం సాగింది. అయితే అంద‌రూ ఊహించ‌నిది తెర‌పై చూపించ‌డ‌మే మారుతి ప్ర‌త్య‌క‌త అన్నారు నాగ‌చైత‌న్య‌. ఈ సినిమా త‌న కెరీర్‌లో ఓ డిఫ‌రెంట్ సినిమా అవుతుంద‌ని అన్నారు.

ఒక‌ మనిషికి ఈగో ఎక్కువైతే ఎన్ని స‌మ‌స్య‌లొస్తాయో దానిని తెర‌పై కామెడీగా చూపించాము. అస‌లు ఈగో అన్న‌దే లేక‌పోతే ఎంతమందితోనైనా ఎలా సరదాగా ఉండొచ్చు అన్న సందేశాన్ని ఇస్తున్నాం. ఒక చిన్న మెసేజ్ కూడి ఉంటుంది ఈ సినిమాలో. వీటిన్నిటితో పాటు మంచి ఎమోషన్స్ తో వెరీ ఎంటర్టైనింగ్ గా ఈ సినిమా తీశార‌ని తెలిపారు. త‌న చుట్టూ ఉండే ఈగోయిస్టుల‌తో స‌మ‌స్య‌ల్ని ఎంత కూల్ గా డీల్ చేశాన‌న్న‌ది తెర‌పైనే చూడండి అని అన్నారు చైతూ. త‌దుప‌రి సినిమాల గురించి చెబుతూ .. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వ ంలో ఓ సినిమా చేస్తున్నాను. ఇందులో స‌మంత క‌థానాయిక‌గా న‌టిస్తుంది. తదుపరి వెంకీ మామ‌తో క‌లిసి ఓ మ‌ల్టీస్టార‌ర్ చేస్తున్నాను .. అని వెల్ల‌డించారు.

User Comments