సైనా బ‌యోపిక్ గుట్టు లీక్‌

Last Updated on by

బ్యాడ్మింట‌న్ స్టార్ సైనా నెహ్వాల్ బ‌యోపిక్‌పై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. ఈ బ‌యోపిక్ ఎప్పుడు ప్రారంభం కానుంది? అన్న చ‌ర్చ అభిమానుల్లో సాగుతోంది. ఆ క్ర‌మంలోనే టీసిరీస్ సంస్థ ప్రీప్రొడ‌క్ష‌న్ ప‌నులు ఇప్ప‌టికే ప్రారంభించింది. సెప్టెంబ‌ర్‌లో ఈ సినిమాని అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తోంది. ఇక ఇప్ప‌టికే టైటిల్ పాత్ర‌లో న‌టించ‌నున్న శ్ర‌ద్ధా క‌పూర్ అవ‌స‌ర‌మైన పూర్తి శిక్ష‌ణ‌ను తీసుకుంది. బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణిగా క‌నిపించాలంటే దానికి చాలా క‌స‌ర‌త్తు అవ‌స‌రం. ఆట‌పై పూర్తి గ్రిప్ ఉండాల్సిందే. పైగా సైనా నెహ్వాల్ ఆట‌తీరు ఎలా ఉంటుంది? శ‌రీర‌భాష ఏంటి? బ్యాట్ ప‌ట్టే తీరు.. ఝ‌లిపించే తీరు.. త‌దిత‌రాల‌పై పూర్తి అవ‌గాహ‌న ఉండాలి. వీట‌న్నిటిపైనా పూర్తిగా త‌ర్ఫీదు పొందింది శ్ర‌ద్ధా.

సినిమాని ఎలానూ సెప్టెంబ‌ర్‌లో సినిమా ప్రారంభిస్తున్నారు కాబ‌ట్టి .. పూర్తి స్థాయి ఫిట్‌నెస్ కోసం శ్ర‌ద్ధా క‌స‌ర‌త్తులు చేస్తోంది. మ‌రోవైపు బ్యాడ్మింట‌న్‌ని రెండోసారి ప్రాక్టీస్ ప్రారంభించిందిట‌. హిందీ మీడియం, గులాబ్ గ్యాంగ్ చిత్రాల ర‌చ‌యిత అమిత్ నాగ్‌పాల్ ఈ బ‌యోపిక్‌కి క‌థ అందించారు. 2015 నుంచి ఈ బ‌యోపిక్ క‌థ కోసం క‌స‌ర‌త్తు చేస్తున్నాన‌ని, ఆ క్ర‌మంలోనే సైనాని ఎంతో ప‌రిశీలించి క‌థ రాసుకున్నాన‌ని నాగ్‌పాల్ ముంబై మిర్ర‌ర్‌కి ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు. ఆమోల్ గుప్తా ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. బ‌యోపిక్‌ల ఒర‌వ‌డిలో సైనా జీవితాన్ని ఆద్యంతం ఉద్విగ్నంగా తెర‌కెక్కించి విజ‌యం సాధించాల‌ని ద‌ర్శ‌కుడు భావిస్తున్నార‌ట‌.

User Comments