ధ్రువ్ స‌ర‌స‌న ఫిదా బ్యూటీ

Last Updated on by

త‌మిళ విల‌క్ష‌ణ న‌టుడు విక్ర‌మ్ త‌న‌యుడు ధ్రువ్ క‌థానాయ‌కుడిగా తెరంగేట్రం చేస్తున్న సంగతి విదిత‌మే. అర్జున్‌రెడ్డి రీమేక్ `వ‌ర్మ‌` చిత్రంలో న‌టిస్తున్నాడు. ఈ చిత్రంలో దేవ‌ర‌కొండ పాత్ర‌లో ధ్రువ్ అభిన‌యిస్తున్నాడు. బాలా ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమా ఆన్ సెట్స్ ఉండ‌గానే ధ్రువ్ న‌టించే రెండో సినిమాకి సంబంధించి వేడెక్కించే క‌థ‌నాలొస్తున్నాయి. ధ్రువ్ త‌దుప‌రి ఓ ద్విభాషా చిత్రంలో న‌టించ‌నున్నాడ‌ని, లీడ‌ర్‌, ఫిదా చిత్రాల ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తార‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. ఈ సినిమా ఇప్ప‌టికే ప్రీప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లో ఉంది. అక్టోబ‌ర్‌లో సెట్స్‌పైకి వెళ‌తార‌ని తెలుస్తోంది.

అయితే ఇందులో ధ్రువ్ స‌ర‌స‌న న‌టించే క‌థానాయిక ఎవ‌రు? అంటే .. `ఫిదా` బ్యూటీ సాయిప‌ల్ల‌వి రేస్‌లో ముందు వ‌రుస‌లో ఉంద‌ని చెబుతున్నారు. ప‌లువురు క‌థానాయిక‌ల పేర్లు ప‌రిశీలించిన క‌మ్ముల‌కు సాయిప‌ల్ల‌విని మించిన బెస్ట్ ఆప్ష‌న్ వేరొక‌రు క‌నిపించ‌లేదుట‌. ధ్రువ్‌ని సైతం ఆయ‌న ఆడిష‌న్స్ చేశాకే ఎంపిక చేసుకున్నార‌ని తెలుస్తోంది. సాయిప‌ల్ల‌వి అయితే అటు త‌మిళ్‌, ఇటు తెలుగు రెండు చోట్లా పాపుల‌ర్. త‌న వ‌ల్ల ఇరుచోట్లా బిజినెస్‌కి ప్ల‌స్ అవుతుంద‌ని క‌మ్ముల టీమ్ భావిస్తోందిట‌. ఆ క్ర‌మంలోనే ఫిదా బ్యూటీకి క‌థ వినిపించి త‌న‌ని నాయిక‌గా ఫైన‌ల్ చేశార‌ట‌. ధ్రువ్‌- సాయిప‌ల్ల‌వి జంట పూర్తి స్థాయి ప్రేమ‌క‌థ‌లో జంట‌గా న‌టిస్తార‌ని తెలుస్తోంది. మ‌రోవైపు ఈ సినిమా ఫిదా సీక్వెల్‌గా తెర‌కెక్క‌నుంద‌న్న ప్ర‌చారం సాగుతోంది. అయితే దీనికి సంబంధించి అధికారికంగా ప్ర‌క‌ట‌న రావాల్సి ఉందింకా.

User Comments