3రోజుల్లో 8 కోట్ల షేర్‌

Last Updated on by

బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ న‌టించిన `సాక్ష్యం` తొలి వీకెండ్‌ మూడు రోజుల్లో 8.4 కోట్ల షేర్‌ వ‌సూలు చేసింద‌ని ట్రేడ్ చెబుతోంది. ఈ సినిమాకి క్రిటిక్స్ నుంచి పెద‌వి విరుపులు రావ‌డంతో ఆ ప్ర‌భావం బాక్సాఫీస్‌పై తీవ్రంగానే క‌నిపిస్తోంద‌ని అర్థ‌మ‌వుతోంది. ఇక అల్లుడు శీనుతో పోలిస్తే ఈ సినిమా వ‌సూళ్ల ప‌రంగా చాలానే వెన‌క‌బ‌డింద‌ని తాజా రిపోర్ట్ తేల్చింది. అల్లుడు శీను కాస్ట్ ఫెయిల్యూర్ కాక‌పోతే బెల్లంకొండ‌కు అదో బంప‌ర్ హిట్టే. ఆ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద 20కోట్లు వ‌సూలు చేసింది.

ఇక `సాక్ష్యం` ప్రాంతాల వారీగా వీకెండ్ ఓపెనింగ్స్ వివ‌రాలు ప‌రిశీలిస్తే.. నైజాం- 2.37 కోట్లు, సీడెడ్‌- 1.49 కోట్లు, ఉత్త‌రాంధ్ర‌- 99ల‌క్ష‌లు, కృష్ణ -49ల‌క్ష‌లు, గుంటూరు- 81ల‌క్ష‌లు, తూ.గో జిల్లా- 49ల‌క్ష‌లు, ప‌.గో జిల్లా-37ల‌క్ష‌లు, నెల్లూరు -24ల‌క్ష‌లు .. ఓవ‌రాల్‌గా ఏపీ-నైజాం క‌లుపుకుని 7.25 కోట్ల షేర్ వ‌సూళ్లు ద‌క్కాయి. అమెరికాలో 20ల‌క్ష‌లు, క‌ర్నాట‌క -67ల‌క్షలు, ఇత‌ర చోట్ల 28ల‌క్ష‌లు క‌లెక్ట్ చేసిందీ చిత్రం. ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్‌ వ‌ర‌ల్డ్‌వైడ్ 25 కోట్ల మేర సాగింద‌ని రిపోర్ట్ అందింది. అంటే ఈ సినిమా ఇక‌పైనా దూకుడుగా వ‌సూళ్లు సాగించినా ఆ మొత్తం షేర్ రాబ‌ట్ట‌డం క‌ష్ట‌మేన‌ని అర్థ‌మ‌వుతోంది.

User Comments