తెలంగాణకు వాళ్లే అస‌లైన సాక్ష్యం

బెల్లంకొండ శ్రీ‌నివాస్ కు హిట్స్ లేవు కానీ గుర్తింపు మాత్రం బాగానే ఉంది. ఈ కుర్ర హీరో సినిమా అంటే బాగానే ఉంటుంద‌నే న‌మ్మ‌కం ప్రేక్ష‌కుల్లో వ‌చ్చింది. కాక‌పోతే ప్ర‌తీ సినిమాకు బ‌డ్జెట్ ఎక్కువైపోవ‌డంతో విజ‌యం మాత్రం రావ‌డం లేదు. అల్లుడుశీను.. జ‌య జాన‌కి నాయ‌కాతో బెల్లంకొండ శ్రీ‌నివాస్ ప‌ర్లేద‌నిపించాడు. ఇక ఇప్పుడు ఈయ‌న సాక్ష్యం సినిమాతో వ‌స్తున్నాడు. మేలోనే రావాల్సిన ఈ చిత్రం అనివార్య కార‌ణాల‌తో జూన్ 14కి పోస్ట్ పోన్ అయింది. ఈ చిత్రాన్ని శ్రీ‌వాస్ తెర‌కెక్కిస్తున్నాడు. ఇప్ప‌టికే షూటింగ్ కూడా చివ‌రిద‌శ‌కు వ‌చ్చేసింది.

విడుద‌ల‌కు నెల రోజుల ముందే బిజినెస్ కూడా భారీగానే జ‌రుగుతుంది ఈ చిత్రానికి. తాజాగా సాక్ష్యం నైజాం రైట్స్ ను ఏషియ‌న్ ఫిల్మ్స్ అధినేత సునీల్ నారంగ్ సొంతం చేసుకున్నాడు. ఫ్యాన్సీ రేట్ కే ఈ చిత్రాన్ని అమ్మిన‌ట్లు తెలుస్తుంది. అల్లుడుశీను 7.50 కోట్ల షేర్..  జ‌య జాన‌కీ నాయ‌కా 6 కోట్ల షేర్ తీసుకొచ్చాయి నైజాంలో. అదే న‌మ్మ‌కంతో ఇప్పుడు ఈ చిత్రాన్ని కూడా భారీగానే అమ్మిన‌ట్లు తెలుస్తుంది. మ‌రి.. సాక్ష్యంతో అయినా బెల్లంకొండ వార‌సుడు అస‌లైన హిట్ కొడ‌తాడో లేదో..?

User Comments