వానాకాలంలో `సాక్ష్యం`

Last Updated on by

ఈ స‌మ్మ‌ర్ బ‌రిలో ప‌లు క్రేజీ సినిమాలు వ‌రుస‌గా రిలీజై సంచ‌ల‌న విజ‌యాలు న‌మోదు చేస్తున్నాయి. వీటిలో రంగ‌స్థ‌లం, భ‌ర‌త్ అనే నేను రికార్డులు తిర‌గ‌రాశాయి. త‌దుప‌రి మే 4న `నా పేరు సూర్య‌` రిలీజ‌వుతోంది. అల్లు అర్జున్‌- వ‌క్కంతం కాంబినేష‌న్‌పై భారీ అంచ‌నాలున్నాయి. అటుపై ర‌జ‌నీకాంత్ `కాలా` రిలీజ్‌కి వ‌స్తోంది. వీట‌న్నిటి నుంచి కాస్త దూరంగానే యంగ్ హీరో బెల్లంకొండ‌ సినిమా రిలీజ‌వుతోంది.

బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ క‌థానాయ‌కుడిగా `లౌక్యం` శ్రీ‌వాస్ తెర‌కెక్కించిన `సాక్ష్యం` రిలీజ్ తేదీ ఖ‌రారైంది. ఈ చిత్రాన్ని జూన్ 14న రిలీజ్ చేస్తున్నామ‌ని అధికారికంగా ప్ర‌క‌టించారు మేక‌ర్స్‌. రిలీజ్ తేదీకి సంబంధించిన పోస్ట‌ర్‌ని ట్విట్ట‌ర్‌లో షేర్ చేశారు. అయితే వేస‌వి వెళ్లిపోయి.. భారీ సినిమాల హ‌డావుడి త‌గ్గాక కాస్తంత రిలాక్స్‌డ్‌గానే వ‌స్తున్నాడు బెల్లంకొండ‌. వేస‌వి తాపం త‌గ్గేవేళ .. ప‌రీక్ష‌ల గోల ఆగే వేళ‌.. రుతుప‌వ‌నాలు తెలుగు రాష్ట్రాల్లో అడుగుపెట్టేవేళ‌… యంగ్ బోయ్ వ‌స్తున్నాడు అంటే ప‌క్కాగా ప్లాన్ చేస్కున్నాడ‌న్న‌మాట‌!  `జ‌య జాన‌కి నాయ‌క‌` ఫ్లాప్ ఇబ్బంది పెట్టినా, ఈ సినిమా మాత్రం అత‌డికి హిట్టిస్తుంద‌నే ధీమాతో ఉన్నాడు. మ‌రి బెల్లంబోయ్‌కి బెల్లం స్వీట్ లాంటి స‌క్సెస్ అందుతుందే లేదో చూడాలి.

User Comments