పంచ‌భూతాలే ర‌క్షించాలి

Last Updated on by

నిర్మాత‌ల త‌న‌యులు హీరోలు అవ్వ‌డం అన్న ట్రెండ్ అనాదిగా ఉన్న‌దే. ఆ కోవ‌లోనే నిర్మాత‌ బెల్లంకొండ సురేష్ త‌న‌యుడు సాయి శ్రీ‌నివాస్‌ హీరోగా త‌న‌ని తాను ప్రూవ్ చేసుకునేందుకు గ‌త నాలుగేళ్లుగా అలుపెర‌గ‌ని పోరాటం సాగిస్తున్నాడు. ఇప్ప‌టికే నాలుగు సినిమాల్లో న‌టించేశాడు. ఇందులో మూడు ఫ్లాప్‌లు. మొద‌టి సినిమా `అల్లుడు శీను` (2014) హిట్టు అన్న టాక్ వ‌చ్చినా కాస్ట్‌ఫెయిల్యూర్‌. అటుపై వ‌చ్చిన `స్పీడున్నోడు` డిజాస్ట‌ర్‌ టాక్ తెచ్చుకుంది. రీసెంటుగానే `జ‌య జాన‌కి నాయ‌క` చిత్రం ఫ‌ర్వాలేద‌ని చెప్పుకున్నా, డ‌బ్బు మాత్రం తిరిగి తేలేద‌ని ట్రేడ్‌లో టాక్ న‌డిచింది.

ఇలాంటి సంక్లిష్ట స‌న్నివేశంలో శ్రీ‌నుకి ఓ బంప‌ర్ హిట్టు ప‌డాల్సి ఉంది. ఈ టైమ్‌లో సాక్ష్యం అంటూ బ‌రిలోకి వ‌చ్చాడు. ఈనెల 27న ఈ సినిమా రిలీజ‌వుతోంది. పంచ‌భూతాలే మా సినిమాకి సాక్షి అని హీరో, ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ప్ర‌చారం సాగించారు. వాటి సాయం త‌మ‌కు ఉంద‌ని, అదే హిట్టిస్తుంద‌ని ధీమాతో ఉన్నారు. ల‌క్ష్యం వంటి క్లాసిక్ హిట్ అందుకున్న శ్రీ‌వాస్ డిక్టేట‌ర్‌తో ఫ్లాప్ అందుకోవ‌డం సీన్‌ కాంప్లికేటెడ్ అయింది. ఆ క్ర‌మంలోనే శ్రీ‌నుకి, వాసుకి ఇద్ద‌రికీ పంచ‌భూతాల సాయం అవ‌స‌ర‌మైంది. ఇక ఈసారి ఎట్టి ప‌రిస్థితిలో బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్టాల్సిందేన‌ని మార్కెట్ వ‌ర్గాల్లోనూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. మ‌రి శ్రీ‌ను హిట్టు కొడ‌తాడా? పంచ‌భూతాలు కాపాడ‌తాయా? అన్న‌ది వేచి చూడాలి.

User Comments