కండ‌ల హీరో గాళ్‌ఫ్రెండ్‌పైనా!!

Last Updated on by

పాకిస్తానీ బోర్న్‌డ్ పాకిస్తానీ న‌టి సోమీ అలీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌ను 14 వ‌య‌సులో రేప్ చేశార‌ని, ఐదేళ్ల‌కు త‌న‌తో మిస్ బిహేవ్ చేశార‌ని ఆరోపించారు. అప్పట్లో `ఆందోళ‌న్` చిత్రంలో న‌టించేప్పుడు స్టార్ హోట‌ల్లో బ‌స చేశాన‌ని, త‌న‌పై ద‌ర్శ‌కుడు వేధింపుల‌కు పాల్ప‌డ్డాడ‌ని సోమి వెల్ల‌డించారు. అలాగే హిందీ ట్యూట‌ర్ గౌత‌మ్ త‌న‌ను చిన్న‌ప్పుడే తాకాల‌ని చూశాడ‌ని తెలిపారు.

వేరొక ఘ‌ట‌న‌లో ప్ర‌ఖ్యాత న‌టి మాధురి ధీక్షిత్ మేక‌ప్ మేన్ ఒక‌రు .. త‌న‌తో ప‌ని చేసేప్పుడు త‌న పెద‌వులు ఎంతో బ్యూటిఫుల్‌గా ఉంటాయ‌ని వాటిని ముద్దు పెట్టుకునేందుకు ప్ర‌య‌త్నించాడ‌ని తెలిపారు. బాలీవుడ్‌లో త‌నూశ్రీ ద‌త్తా చేస్తున్న ఈ పోరాటం ఇంకా ముందుకు సాగాలి. త‌న ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండ‌లేను అని సోమి బాస‌ట‌గా నిలిచారు. 40 ఏళ్ల నాటి జ్ఞాప‌కాలు త‌న‌ని ఇంకా వెంటాడుతూనే ఉన్నాయ‌ని గ‌తాన్ని గుర్తు చేసుకున్నారు. ఇంత‌కీ సోమి అలీ ఎవ‌రు? అంటే అప్ప‌ట్లో స‌ల్మాన్ ఖాన్ గాళ్ ఫ్రెండ్ అన్న ప్ర‌చారం ఉంది. త‌న‌తో క‌లిసి క్లాసిక్ సినిమాలోనూ న‌టించింది సోమీ. మీటూ ఇండియా ఉద్య‌మం నేప‌థ్యంలో త‌న‌పై జ‌రిగిన వేధింపుల ప్ర‌హ‌స‌నాన్ని బ‌య‌టి ప్ర‌పంచానికి బ‌హిర్గ‌తం చేసంది. సోమి “నో మోర్ టియ‌ర్స్ డాట్ ఓఆర్‌జీ“ ద్వారా హ్యూమ‌న్ ట్రాఫికింగ్, గృహ హింస బాధితుల‌ను ఆదుకునేందుకు కృషి చేస్తున్నారు.

User Comments