సల్మాన్‌-క‌మ‌ల్ స్నేహ‌బంధం

Last Updated on by

సౌత్ సూప‌ర్‌స్టార్‌- నార్త్ సూప‌ర్‌స్టార్ క‌ల‌యిక‌లో మ‌ల్టీస్టార‌ర్ తెర‌కెక్క‌నుందా? అంటే అవున‌నే భావిస్తున్నారంతా. వెంట‌నే ప్రారంభం కాక‌పోయినా, అందుకు ఆస్కారం లేక‌పోలేద‌న్న అంచ‌నాలేర్ప‌డ్డాయి. మిస్ట‌ర్ పెర్ఫెక్ట్ అమీర్‌ఖాన్ 5 భాగాలుగా తెర‌కెక్కించ‌నున్న `మ‌హాభార‌తం` సిరీస్‌లోనూ క‌మ‌ల్ న‌టిస్తార‌ని ఇదివ‌ర‌కూ ప్ర‌చారం సాగింది. అంత‌కుముందు `హేరామ్‌`లో కింగ్ ఖాన్ షారూక్‌కి క‌మ‌ల్ ఛాన్సిచ్చాడు. ఆ సినిమా రిలీజ్‌కి ర‌క‌ర‌కాల అడ్డంకులు ఏర్ప‌డిన సంగ‌తి తెలిసిందే. అదంతా అటుంచితే ప్ర‌స్తుతం ఉల‌గ‌నాయ‌గ‌న్ క‌మ‌ల్ హాస‌న్ బాలీవుడ్ స్నేహాల‌పై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఉత్తరాది ప‌రిశ్ర‌మ‌లో ఖాన్‌ల త్ర‌యానికి క‌మ‌ల్ అత్యంత స‌న్నిహితుడు. అందుకే ప్ర‌తిసారీ ఖాన్‌ల‌తో క‌మ‌ల్ అనుబంధంపై వాడి వేడిగా డిస్క‌ష‌న్ సాగుతుంటుంది.

ఈసారి కూడా త‌న స్నేహితుడు స‌ల్మాన్ ఖాన్ మోస్ట్ కాంట్ర‌వ‌ర్శియ‌ల్ ఫిలిం విశ్వ‌రూపం 2కి ప్ర‌చారం చేసేందుకు సంసిద్ధ‌మ‌వుతున్నాడు. స‌ల్మాన్ హోస్టింగ్ చేస్తున్న `ద‌స్ కా ద‌మ్` రియాలిటీ షోలో విశ్వ‌రూపం 2 ప్ర‌మోష‌న్ చేసేందుకు త‌న‌వంతు సాయం చేస్తున్నాడు. ఇదివ‌ర‌కూ వివాదాలు చుట్టుముట్టిన‌ప్పుడు `విశ్వ‌రూపం -` చిత్రానికి స‌ల్మాన్ మ‌ద్ధ‌తు ప‌లికాడు. విశ్వ‌రూపం బాలీవుడ్‌లోనూ పెద్ద సక్సెసైంది. ఇప్పుడు మ‌రోసారి స్నేహితుడికి ప్ర‌చార‌ సాయం చేస్తున్నాడు స‌ల్మాన్‌. ఇక‌పోతే స‌ల్మాన్ – క‌మ‌ల్ హాస‌న్ క‌ల‌యిక‌లో ఓ మ‌ల్టీస్టార‌ర్ తెర‌కెక్కితే చూడాల‌ని అభిమానులు త‌హ‌త‌హ‌లాడుతున్నారు. విశ్వ‌రూపం 2 హిందీ వెర్ష‌న్‌ని బాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ రోహిత్ శెట్టి – రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ స‌మ‌ర్ప‌ణ‌లో రిలీజ్ చేస్తున్నారు.

User Comments