సల్మాన్ ఖాన్ – కత్రిన జంటగా నటించిన భారత్ చిత్రాన్ని తెలుగులో ఏషియన్ ఫిలింస్ సంస్థ రిలీజ్ చేయనుంది. ఈ సినిమా ఏపీ- తెలంగాణ రైట్స్ ని ఏషియన్ సినిమాస్ దక్కించుకుంది. అయితే ఈ చిత్రాన్ని తెలుగు వెర్షన్ అనువదించి రిలీజ్ చేస్తున్నారా.. లేదా? అన్నదానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
ఇప్పటికే భారత్ టీజర్.. ట్రైలర్ సహా ప్రతిదీ ఆకట్టుకున్నాయి. సల్మాన్ ఇందులో ఓ సర్కస్ వాలా పాత్రలో నటిస్తూనే భారత నావికాదళ కమాండర్ గా రక్తి కట్టించే పాత్రలో నటిస్తున్నారు. ఇది సల్మాన్ కెరీర్ బెస్ట్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ అని చెబుతున్నారు. ఇందులో లోఫర్ బ్యూటీ దిశా పటానీ ఓ ఆసక్తికర పాత్రలో స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వనుంది. జూన్ 6న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు.