ట్రెండీ టాక్‌: సాహో గెస్ట్‌ స‌ల్మాన్

Last Updated on by

ప్ర‌భాస్ – శ్ర‌ద్ధా క‌పూర్ జంట‌గా సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో యువి క్రియేష‌న్స్ నిర్మిస్తున్న `సాహో` ఆగ‌స్టు 15న స్వాతంత్య్ర దినోత్స‌వ కానుక‌గా రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. నిన్న‌నే కొత్త పోస్ట‌ర్ పై రిలీజ్ తేదీని అధికారికంగా ప్ర‌క‌టించారు మేక‌ర్స్. 2019 లో మోస్ట్ అవైటెడ్ మూవీగా సాహో గురించిన ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఈ ఏడాది భారీ మ‌ల్టీస్టార‌ర్ జాబితాలోకి చేరింది. ఈ చిత్రంలో ప్ర‌భాస్- శ్ర‌ద్ధా క‌పూర్- నీల్ నితిన్ ముఖేష్- జాకీ ష్రాఫ్‌- మందిరా భేడీ- అరుణ్ విజ‌య్ త‌దిత‌ర తారాగణం న‌టిస్తున్నారు. హాలీవుడ్ నుంచి ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫ‌ర్లు భీభ‌త్స భ‌యాన‌క పెర్ఫామెన్స్ ఇవ్వ‌బోతున్నార‌ని మేకింగ్ వీడియోలు చెప్పాయి.

తాజాగా ఈ సినిమాలో బాలీవుడ్ కండ‌ల హీరో స‌ల్మాన్ ఖాన్ ఓ అతిధి పాత్ర‌లో న‌టించే వీలుంద‌ని తెలుస్తోంది. సాహోలో ఓ అతిధి పాత్ర ఉంది. ఆ పాత్ర‌లో స‌ల్మాన్ న‌టిస్తే బావుంటుంద‌ని నీల్ నితిన్ ముఖేష్ స‌జెస్ట్ చేశార‌ట‌. వెంట‌నే ద‌ర్శ‌క‌నిర్మాత‌లు అత‌డిని సంప్ర‌దించార‌ని తెలుస్తోంది. అయితే స‌ల్మాన్ సంత‌కం చేశారా లేదా? అన్న‌ది తెలియాల్సి ఉంది. ఒక‌వేళ స‌ల్మాన్ ఈ ప్రాజెక్టుకు ఓకే చెబితే అది ప్ర‌భాస్ కి క‌లిసొచ్చేదే. ప్ర‌భాస్- స‌ల్మాన్ మ‌ల్టీస్టార‌ర్ గా ఈ చిత్రాన్ని ప్ర‌మోట్ చేసేందుకు వీలుంటుంది. త‌ద్వారా అటు హిందీ మార్కెట్ కి పెద్ద ప్ల‌స్ కానుంది. ప్ర‌స్తుతానికి ప్ర‌య‌త్నాలు అయితే సాగుతున్నాయి. మ‌రి ఎంత‌వ‌ర‌కూ ఫ‌లిస్తాయి? అన్న‌ది చూడాలి. ఇక 2019లోనే ఇండియాస్ బెస్ట్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ని అందించేందుకు యువి క్రియేష‌న్స్ సంస్థ ఏకంగా 300 కోట్ల మేర బ‌డ్జెట్ పెడుతోంద‌ని తెలుస్తోంది. స‌ల్మాన్ ప్ర‌స్తుతం `భారత్` చిత్రంతో పాటు `ద‌బాంగ్ 3`లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

Also Read : Saaho New Poster Rocking 

User Comments