Last Updated on by
అదేంటి.. సమ్మర్ చంపేస్తుంటే సల్మాన్ కు చలి ఎక్కడ్నుంచి వస్తుంది..? అదేం విచిత్రం అనుకుంటున్నారా..? నమ్మడానికి కాస్త కష్టంగా ఉన్నా సల్మాన్ చేస్తున్నది మాత్రం ఇదే. ఈయన నిజంగానే ఇప్పుడు చలి కాచుకుంటున్నాడు. చెమటలు కక్కిస్తున్న ఎండలో కూడా ఈయన చలి పుడుతుంది మరి. ప్రస్తుతం ఈయన లడక్ లో ఉన్నాడు. అక్కడే రేస్ 3 సాంగ్ షూట్ తో బిజీగా ఉన్నాడు. జాక్వలిన్ తో కలిసి డ్యూయెట్లు పాడుకుంటున్నాడు కండలవీరుడు. ఇదివరకే ఈ ఇద్దరూ కలిసి కిక్ లో నటించారు. అది బ్లాక్ బస్టర్. ఇప్పుడు మరోసారి జోడీ కడుతున్నారు ఈ జంట. రెమో డిసౌజా దర్శకుడు. లడక్ లోనే ఉదయమే లేచి షూటింగ్ కు వెళ్తున్నాడు సల్మాన్. అక్కడ గడ్డ కట్టుకుపోయే చలిలో హాయిగా చలిమంటేసుకుని పక్కనే జాక్వలిన్ తో ఎంజాయ్ చేస్తున్నాడు సల్మాన్ ఖాన్. మండే ఎండల్లో కూడా మంచు కురిసే వేళలో అన్నట్లు పాడుకుంటున్నాడు ఈ కండల వీరుడు.
User Comments