సల్మాన్ ఖాన్ రేస్ షురూ చేసాడు

Last Updated on by

స‌ల్మాన్ ఖాన్ మ‌ళ్లీ వ‌చ్చేసాడు.. చెప్పిన టైమ్ కంటే కాస్త ఆల‌స్యంగా వ‌చ్చినా అద‌ర‌గొట్టాడు. టైగ‌ర్ జిందా హై తో గ‌తేడాది రికార్డుల భ‌ర‌తం ప‌ట్టిన కండ‌ల వీరుడు.. ఇప్పుడు రేస్ పెట్టుకున్నాడు. తాజాగా రేస్ 3 ట్రైల‌ర్ విడుద‌లైంది. 3 నిమిషాల‌కు పైగానే ఉన్న ఈ ట్రైల‌ర్ చూసిన త‌ర్వాత‌.. మాట‌లైతే లేవు అదుర్స్ అంటూ క‌ళ్లప్ప‌గించి చూడ‌టం త‌ప్ప‌. రేస్ 1.. 2 కంటే ఇప్పుడు విజువ‌ల్ ట్రీట్ మ‌రింత‌గా అదిరిపోయింది. క్యాస్టింగ్ కూడా పెరిగింది. స‌ల్మాన్ ఫీట్స్ అండ్ ఫైట్స్ తో ట్రైల‌ర్ అంతా అరాచ‌క‌మే. రెమో డిసౌజా తెర‌కెక్కించిన ఈ చిత్రంపై అంచ‌నాలు మామూలుగా లేవు.

స‌ల్మాన్ ఖాన్ తో పాటు అనిల్ క‌పూర్, బాబీ డియోల్, జాక్వ‌లిన్ ఫెర్నాండేజ్, డైసీ షా ఇందులో న‌టిస్తున్నారు. కిక్ త‌ర్వాత స‌ల్మాన్, జాక్వ‌లిన్ న‌టిస్తున్న సినిమా ఇది. ఈ చిత్రాన్ని ర‌మేష్ తౌరానితో క‌లిసి స‌ల్మాన్ ఖాన్ నిర్మిస్తున్నాడు. ట్రైల‌ర్ తోనే అంచ‌నాలు మ‌రో స్థాయికి వెళ్లిపోయాయి. ఖచ్చితంగా పార్ట్ 1.. 2 తో పోలిస్తే ఈ మూడో భాగంతో బాక్సాఫీస్ రికార్డుల‌కు మూడిన‌ట్లుగానే క‌నిపిస్తుంది. తొలి రెండు భాగాల‌ను అబ్బాస్ మ‌స్తాన్ తెర‌కెక్కిస్తే.. ఇప్పుడు రెమో డిసౌజా సిరీస్ లోకి వ‌చ్చాడు. సినిమా జూన్ 15న విడుద‌ల కానుంది.

User Comments