తార‌క్ కు జోడీగా శ్రీలంక బ్యూటీ?

ద‌ర్శ‌క ధీరుడు జ‌క్క‌న్న `ఆర్ ఆర్ ఆర్` షూటింగ్ లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. రామ్ చ‌ర‌ణ్ కు జోడీగా అలియా భ‌ట్ ను ఎంపిక చేసినా, జూనియ‌ర్ ఎన్టీఆర్ కు మాత్రం ఇంకా హీరోయిన్ దొర‌క‌లేదు. బ్రిట‌న్ బ్యూటీ డైషీ ఎడ్గార్ జోన్స్ షాని ఎంపిక చేసినా అనివార్య కార‌ణాల వ‌ల్ల ఆమె త‌ప్పుకుంది. దీంతో ఆ స్థానాని ఏ హీరోయిన్ తో భ‌ర్తీ చేయాల‌ని కొన్ని రోజుల నుంచి జ‌క్క‌న్న స‌త‌మ‌త‌వుతున్నాడు. ఈ నేప‌థ్యంలో ఇటీవ‌లే `ఆర్ ఆర్ ఆర్` టీమ్ తో ట‌చ్ లో ఉన్న బాలీవుడ్ న‌టుడు స‌ల్మాన్ ఖాన్ జ‌క్క‌న్న‌కు ఓ స‌ల‌హా ఇచ్చాడుట‌. తారక్ కు జోడీగా శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తీసుకోమ‌ని స‌ల‌హ‌తో ఇచ్చాడు.

ఆ పాత్ర‌కు జాక్వెలిన్ ప‌ర్ పెక్ట్ గా ఉంటుంద‌ని, బ్రిటీష్ అమ్మాయి పోలీక‌లు ఆమెలో ఉన్నాయ‌ని జ‌క్క‌న్న ను ఒప్పించే ప్ర‌య‌త్నం చేసాడుట‌. మ‌రి భాయ్ స‌ల‌హాను జ‌క్క‌న్న ఎంత వ‌ర‌కూ తీసుకుంటాడో చూద్దాం. జాక్వెలిన్ ను బాలీవుడ్ కు ప‌రిచ‌యం చేసింది స‌ల్మాన్ ఖాన్ అన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఆ పాత్ర కోసం శ్ర‌ద్ధా క‌పూర్, నిత్యామీన‌న్, ప‌రిణీతి చోప్రా పేర్లు విన‌పించిన సంగ‌తి తెలిసిందే. మ‌రీ వీళ్లంద‌రిలో ఆ ల‌క్కీ గాళ్ల్ ఎవ‌రో? ఇందులో బాలీవుడ్ న‌టుడు అజ‌య్ దేవ‌గ‌ణ్ ఓ ముఖ్య మైన పాత్ర పోషిస్తోన్న సంగ‌తి తెలిసిందే. అన్ని ప‌నులు పూర్తిచేసి వ‌చ్చే ఏడాది సినిమా విడుద‌ల చేయ‌నున్నారు.

Also Watch : Megastar’s Heroine Hot Pic Making Heads Turn