అప్పుడు.. ఇప్పుడు ఒక్కటే జరిగింది

Last Updated on by

రంజాన్ సీజ‌న్ అంటే స‌ల్మాన్ సినిమాలు రావాల్సిందే.. వ‌చ్చిన ప్ర‌తీ సినిమా బాక్సాఫీస్ ను కుమ్మేయాల్సిందే..! అలా అల్లాను ద‌ర్శించుకుని.. న‌మాజ్ చేసుకుని వెంట‌నే వెళ్లి స‌ల్మాన్ సినిమా చూస్తే వ‌చ్చే మ‌జానే వేరు. కొన్నేళ్లుగా జ‌రుగుతున్న‌ది కూడా ఇదే. అభిమానులు అంత‌గా రంజాన్ కు స‌ల్మాన్ సినిమాలు ఓన్ చేసుకున్నారు. ఆయ‌న కూడా క‌థ‌లు డిఫెరెంట్ గా ట్రై చేస్తూ కొన్నేళ్లుగా భ‌జ‌రంగీ భాయీజాన్.. ద‌బంగ్.. కిక్.. సుల్తాన్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాలు ఇచ్చాడు. అయితే గ‌తేడాది నుంచి సీన్ మారిపోయింది. ఇప్పుడు ఈయ‌న నుంచి వ‌స్తున్న సినిమాలు పెద్ద‌గా ఆడ‌టం లేదు. గ‌తేడాది ఈద్ సంద‌ర్భంగా విడుద‌లైన ట్యూబ్ లైట్ స‌ల్మాన్ కెరీర్ లోనే పెద్ద డిజాస్ట‌ర్ గా నిలిచింది. క‌నీసం 100 కోట్లు కూడా వ‌సూలు చేయ‌లేదు ఈ చిత్రం. ఇక ఇప్పుడు ఈ రంజాన్ కు రేస్ 3 తో షాక్ ఇచ్చాడు స‌ల్మాన్ ఖాన్.

భారీ అంచ‌నాల మ‌ధ్య జూన్ 15న దాదాపు 4000 థియేట‌ర్స్ లో విడుద‌లైన రేస్ 3 కూడా నిరాశ ప‌రిచింది. సినిమాలో యాక్ష‌న్ త‌ప్ప క‌థ లేద‌ని తేల్చేసారు ప్రేక్ష‌కులు. ముఖ్యంగా రేస్ సిరీస్ అంటే ట్విస్టుల‌కు మారుపేరు. కానీ రేస్ 3లో అవెక్క‌డా క‌నిపించ‌వు. అలా ఫ్లాట్ గా ఏ ట్విస్ట్ లేకుండా సాగిపోయే క‌థ‌తో ప్రేక్ష‌కులు త‌లలు ప‌ట్టుకుంటున్నారు. స‌ల్మాన్ కు ఉన్న క్రేజ్ వాడుకోడానికి.. రంజాన్ కు వ‌చ్చే హాలీడేస్ వాడుకోడానికే యాక్ష‌న్ తో అలా చుట్టేసాడు ద‌ర్శ‌కుడు రెమోడిసౌజా. డాన్సులు చేసుకునే వాడికి యాక్ష‌న్ సినిమాలు ఇస్తే ఇలాగే డాన్సుకు.. యాక్ష‌న్ కు కాకుండా మ‌ధ్య‌లో వ‌దిలేస్తాడంటూ విమ‌ర్శిస్తున్నారు ప్రేక్ష‌కులు. మొత్తానికి రంజాన్ కు వ‌స్తే సినిమా హిట్ అనే న‌మ్మ‌కం ఇప్పుడు స‌న్న‌గిల్లుతుంది. రెండేళ్ల‌లో రెండు ఫ్లాపులు ప్రేక్ష‌కులకు ఇచ్చేసాడు స‌ల్మాన్ ఖాన్. అన్న‌ట్లు ఈ చిత్రం తొలిరోజు 29 కోట్లు వ‌సూలు చేసింది. స‌ల్మాన్ గ‌త సినిమా టైగ‌ర్ జిందా హై తొలిరోజు 35 కోట్ల‌కు పైగా తీసుకొచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం అందులో 7 కోట్లు త‌క్కువ తీసుకొచ్చింది రేస్ 3.

User Comments