మూడు రోజుల ముచ్చ‌టే అయింది

Last Updated on by

ఏదైనా మొద‌ట్లో బాగా మురుస్తుంటే.. నీదంతా మూడు రోజుల ముచ్చ‌టేరా అంటారు క‌దా.. ఇప్పుడు రేస్ 3ను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. స‌రిగ్గా మూడంటే మూడే రోజులు బాక్సాఫీస్ అరాచ‌కం చేసాడు స‌ల్మాన్ ఖాన్. ఆయ‌న ఉన్నాడు కాబ‌ట్టి ఎలా ఉన్నా తొలి మూడు రోజులు చూసేస్తారు ప్రేక్ష‌కులు. పైగా రంజాన్ సీజ‌న్.. సెల‌వులు అన్నీ క‌లిసొచ్చాయి. దాంతో కంటెంట్ తో ప‌నిలేకుండా స్టార్ హీరో సినిమా చూడాల‌నే ఆశ‌లో రేస్ 3ని తొలి మూడు రోజులు నెత్తిన పెట్టుకున్నారు. దాని ఫ‌లిత‌మే మూడు రోజుల్లోనే 106 కోట్లు.. ప్ర‌పంచ వ్యాప్తంగా 140 కోట్లు. కానీ మూడ్రోజుల త‌ర్వాత సీన్ రివ‌ర్స్ అయిపోయింది.

మూడోరోజు 39 కోట్లు వ‌సూలు చేసిన రేస్ 3.. నాలుగో రోజుకు వ‌చ్చేస‌రికి పూర్తిగా డ‌ల్ అయిపోయింది. ఒక్క‌టి రెండు కాదు.. 25 కోట్లు త‌క్కువ వ‌సూళ్లు తీసుకొచ్చింది ఈ చిత్రం. తొలి సోమ‌వారం కేవ‌లం 14 కోట్లు మాత్ర‌మే వ‌సూలు చేసింది రేస్ 3. కంటెంట్ ఉంటే నాలుగో రోజు కూడా 20 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసిన సినిమాలు చాలానే ఉన్నాయి. కానీ రేస్ 3 లో విష‌యం త‌క్కువ‌గా ఉంద‌ని తొలిరోజే టాక్ వ‌చ్చేసింది. దాంతో సినిమా ఎటూ కాకుండా పోతుందిప్పుడు. ఈ చిత్రం సేఫ్ అవ్వాలంటే అక్ష‌రాలా 300కోట్లు వ‌సూలు చేయాలి. కానీ ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో అన్ని కోట్లు తీసుకురావ‌డం మాత్రం క‌ష్ట‌మే.

User Comments