స‌ల్మాన్ ప్రేయ‌సికి భూకంపం టెన్ష‌న్

బాలీవుడ్ హీరో సల్మాన్‌ ఖాన్‌ ప్రేయసిగా ఉలియా వంతూర్ ఫేమ‌స్ అయిన సంగ‌తి తెలిసిందే. తాజాగా అమ్మ‌డు త‌నకు ఎదెరైన ఓ భ‌యానక‌ అనుభ‌వం గురించి చెప్పుకొచ్చింది. ఇటీవ‌లే ఇండొనేసియా లో భారీ భూకంపం సంభ‌వించిన సంగ‌తి తెలిసిందే. ఆ స‌మ‌యంలో ఉలియా అక్క‌డే ఉంద‌ట‌. ఓ ప‌ని నిమిత్తం ఇండోనేసియాలోని బాలిలోని ఓ హోటల్‌లో బస చేసిందిట‌. ఆ సమయంలో 5.7 తీవ్రతతో భూమి కంపించింది. దీంఓ కాళ్లుఏ చేతులు ఆడ‌లేదు. మైండ్ స్ర్ట‌క్ అయిపోయిందిట‌. కానీ అదృష్టవశాత్తు ఏమీ కాలేద‌ని, కాసేపటికే అంతా సర్దుకుంద‌ని, కానీ ఒళ్లంతా చెమ‌ట‌తో త‌డిసి ముద్ద‌యింద‌ని తెలిపింది. ఈ విషయాన్ని ఉలియా ఇన్‌స్టాగ్రామ్ లో వెల్ల‌డించింది.

‘ఉదయం భయంకరమైన అలారమ్‌తో నిద్రలేచాను. ప్రస్తుతం నేనున్న బాలి ప్రదేశంలో 5.7 తీవ్రతతో భూమి కంపించింది. కొన్ని క్షణాల పాటు ఎన్నో ఆలోచనలు బుర్రలో తిరిగాయి. కానీ నేను దేవుడిపై భారం వేసి మౌనంగా ఉండాలనుకున్నాను. ఎలాంటి చెడు జరగదని నా మనసుకు అనిపిస్తూనే ఉంది. అనుకున్నట్లుగానే దేవుడి దయ వల్ల ఎవ్వరికీ ఏమీ కాలేదు. కొన్ని క్షణాల్లోనే అంతా సాధారణ స్థితికి వచ్చింది. ఈరోజు నేను షూటింగ్‌కి ఏమీ కానట్లే వెళ్లాను. కానీ నేనింకా బతికే ఉన్నానని ఇప్పటికీ మనసులో అనుకుంటూనే ఉన్నాన‌ని ఓ వీడియోను పోస్ట్ చేసింది.