హిట్ డైరెక్ట‌ర్‌కు నో చెప్పేసింది!

Why Samantha Missed ANR National Awards Event

క‌థ‌ల‌ ఎంపిక‌లో కొత్త పంథాని అనుస‌రిస్తోంది సామ్. గ‌త కొంత కాలంగా న‌ట‌న‌కు ఆస్కార‌మున్న చిత్రాల్లోనే న‌టిస్తోంది. ద‌ర్శ‌కులు కూడా నాయికా ప్రాధాన్య‌త‌.. ఎమోష‌న్ ఉన్న క‌థ‌లనే స‌మంత‌కు వినిపిస్తున్నారు.  క‌న్న‌డ‌లో సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకున్న చిత్రం `యూట‌ర్న్‌` డైరెక్ట‌ర్ ప‌వ‌న్‌కుమార్ తెలుగు వెర్ష‌న్ కి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ సినిమాని.. ద‌ర్శ‌కుడు ప‌వ‌న్ ప్ర‌తిభ‌ను స‌మంత అప్ప‌ట్లో సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌చారం చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే యూట‌ర్న్ హిందీ రీమేక్ ఆఫ‌ర్ కు సామ్ ఎందుక‌నో సిద్ధంగా లేదు.

క‌న్న‌డ‌, తెలుగు భాష‌ల్లో `యూట‌ర్న్‌` చిత్రాన్ని తెర‌కెక్కించిన‌ ప‌వ‌న్ కుమార్ ఇదే చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేయ‌డానికి గ‌త కొంత కాలంగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. తాజాగా చ‌ర్చ‌లు ఓ కొలిక్కి రావ‌డంతో `యూట‌ర్న్‌` బాలీవుడ్ లో రీమేక్ కాబోతోంది. ఇందులో స‌మంత‌నే న‌టిస్తుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే బాలీవుడ్ రీమేక్ లో త‌ను న‌టించాల‌నుకోవ‌డం లేద‌ని ద‌ర్శ‌కుడు ప‌వ‌న్ కుమార్ కు స‌మంత చెప్పిన‌ట్లు స‌మాచారం.

దీంతో సామ్ పోషించిన‌ పాత్ర‌లో తాప్సీని ద‌ర్శ‌కుడు సంప్ర‌దిస్తున్నాడ‌ట‌. తాప్సీ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేస్తే `యూట‌ర్న్‌` ప‌ట్టాలెక్క‌డం ఇక లాంఛ‌న‌మే అవుతుంది. స‌మంత ప్ర‌స్తుతం త‌మిళ హిట్ చిత్రం `96` ఆధారంగా తెలుగులో రీమేక్ అవుతున్న చిత్రంలో న‌టిస్తోంది. వెబ్ సిరీస్ `ఫ్యామిలీ మ్యాన్ 2`లోనూ న‌టిస్తోంది. ఉత్త‌రాది చిత్ర‌ల్లో న‌టించ‌డం ఇష్టం లేకే `యూట‌ర్న్‌` రీమేక్ ని వ‌దులుకున్న‌ట్టు స‌మంత చెబుతున్నార‌ట‌. మ‌రి `ఫ్యామిలీ మ్యాన్‌-2` వెబ్ సిరీస్ హిందీ లోనూ రూపొందిస్తున్నారు క‌దా.. మరి దీన్నెందుకు సామ్ రిజెక్ట్ చేయ‌లేదో త‌న‌కే తెలియాలి.