స‌మంత‌.. క్వీన్ ఆఫ్ మిలియ‌న్..

ఒక్క మిలియ‌న్ డాల‌ర్ సాధించినందుకే కొంద‌రు హీరోయిన్లు ఎగిరి ప‌డుతుంటారు. కానీ స‌మంత మాత్రం క్వీన్ ఆఫ్ మిలియ‌న్ అయిపోయింది. సౌత్ ఇండియాలోనే కాదు.. ఇండియాలోనే ఏ హీరోయిన్ కు సాధ్యం కాని రికార్డులు స‌మంత‌కు సాధ్య‌మ‌య్యాయి. ఈమె న‌టించిన 13 సినిమాలు మిలియ‌న్ డాల‌ర్ క్ల‌బ్ లో చోటు సంపాదించాయి. క‌నీసం మ‌రే హీరోయిన్ ఈ ముద్దుగుమ్మ స‌మీపంలో కూడా లేదు. అప్పుడెప్పుడో కెరీర్ కొత్త‌లో దూకుడు సినిమాతో మొద‌లైంది ఈ మిలియ‌న్ డాల‌ర్ క్ల‌బ్ దండ‌యాత్ర‌ ఇప్పుడు రంగ‌స్థ‌లం వ‌ర‌కు ర‌చ్చ సాగుతూనే ఉంది. స్యామ్ దూకుడు ముందు రికార్డుల షేపులు మారిపోతున్నాయి. దూకుడుతో మొద‌లై.. ఈగ‌.. అత్తారింటికి దారేది.. మ‌నం.. సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు.. జ‌న‌తా గ్యారేజ్.. బ్ర‌హ్మోత్స‌వం.. మెర్స‌ల్.. 24.. అ..ఆ.. స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి.. తెరీ సినిమాల‌తో ఇప్ప‌టికే డ‌జ‌న్ సార్లు మిలియ‌న్ డాల‌ర్ క్ల‌బ్ లోకి అడుగుపెట్టింది స‌మంత‌. ఇక ఇప్పుడు రంగ‌స్థ‌లంతో మ‌రోసారి ఇదే ఫీట్ చేసింది స‌మంత‌. ఈ చిత్రం ఏకంగా 2 మిలియ‌న్ కూడా దాటేసి.. 3 మిలియ‌న్ వైపు అడుగేస్తుంది. ఇదంతా చూస్తుంటే స‌మంత‌ను ఇప్ప‌టికీ నెంబ‌ర్ వ‌న్ హీరోయిన్ అన‌డంలో ఎలాంటి ఆశ్చ‌ర్యం లేదేమో మ‌రి..?