సమంత నవ్వుకు పడిపోవాల్సిందే

Last Updated on by

స‌మంత‌లో ఉన్న గొప్ప‌త‌నం అదే. కారెక్ట‌ర్ లోకి ఈజీగా దూరేస్తుంటుంది. అందుకే ప‌దేళ్లైనా ఇప్ప‌టికీ స్టార్ హీరోయిన్ గానే కొన‌సాగుతుంది ఈ భామ‌. ఈ మ‌ధ్యే పెళ్లైనా కూడా ఇప్ప‌టికీ స‌మంత‌తో న‌టించ‌డానికి స్టార్ హీరోలు ఆస‌క్తి చూపిస్తున్నారు. ఇప్పుడు విడుద‌లైన రంగ‌స్థ‌లంలోని పాట స‌మంత‌లో మ‌రో కోణాన్ని ప్రేక్ష‌కుల‌కు చూపించింది. రామ‌ల‌క్ష్మిగా త‌న చూపుల‌తోనే మాయ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. ఇదిలా ఉండ‌గానే ఇప్పుడు విశాల్ తో స‌మంత న‌టించిన ఇరుంబు తిరైలోని ఓ పాట విడుద‌లైంది.

ఇరుంబు తిరై మేకింగ్ లో స‌మంత చేసిన అల్ల‌రి మామూలుగా లేదు. విశాల్ ను కూడా ఆడేసుకుంది ఈ బ్యూటీ. ఇక విశాల్ తో ఈ భామ‌కు కెమిస్ట్రీ కూడా బాగానే కుదిరింది. ఎక్క‌డా అందాలు ఆర‌బోయ‌లేదు కానీ సింపుల్ గా న‌వ్వుల‌తోనే చంపేసింది స్యామ్. ఈ భామను చూసిన త‌ర్వాత ఎవ‌రి మ‌న‌సైనా ఒక్క‌సారి అలా గాడి త‌ప్పాల్సిందే. అంత‌గా న‌వ్వుతో మాయ చేసింది మాయ‌లేడి. ఈ సినిమా షూటింగ్ ఇప్ప‌టికే పూర్త‌యింది. మిత్ర‌న్ తెర‌కెక్కించిన ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రిలోనే విడుద‌ల కానుంది. తెలుగులో అభిమన్యుడుగా ఈ చిత్రం విడుద‌ల కానుంది.

User Comments