పాపం సమంతను ఆడుకుంటున్నారుగా..?

సమంత గత వారం రోజులుగా సోషల్ మీడియా అంతా తెగ హడావుడి చేస్తూ కనిపించింది. ఈ హడావుడి ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారా.. అక్కడికే వస్తున్నా.. సమంత కాబోయే భర్త నాగ చైతన్య నటించిన యుద్ధం శరణం సినిమా గురించే. గత వారం రోజులుగా పాపం ఎక్కడికి వెళ్ళినా చేతిలో ఫోన్ పట్టుకొని.. ఈ సినిమా గురించి పబ్లిసిటీ చేయడం మొదలు పెట్టిందా అనేంతలా అమ్మడు సినిమాను ప్రమోట్ చేసింది. ఇక సినిమా రిలీజ్ అయిన క్షణంలో దాని గురించి ఎవరు కామెంట్ చేసినా వెంటనే రెస్పాన్స్ అవుతూ వచ్చింది. షూటింగ్ లో ఉన్నా సరే ఏమాత్రం గ్యాప్ దొరికినా.. నాగ చైతన్య సినిమా గురించే ఆలోచించేదేమో అనేలా యుద్ధం శరణం అంటూ పిచ్చెక్కించింది. అందుకే సినిమా విడుదల ఉదయం కూడా ఈ అమ్మడు చైతుకి ఆల్ ది బెస్ట్ చెప్పింది.
ఇదే సమయంలో సినిమా ఫస్ట్ హాఫ్ బాగుంది అని రెస్పాన్స్ రావడంతో.. సినిమాపై నమ్మకాలూ పెరిగాయి. సమంతకూడా హ్యాపీగా ఫీలైంది. కాని, సెకండ్ హాఫ్ విషయానికి వస్తే.. సినిమా అంత పెద్దగా లేదు.. ఏదో సోసోగా ఉంది.. ఓవరాల్ గా సినిమా పోయినట్టే అని రివ్యూలు ఎక్కువగా రావడంతో.. పాపం సమంత తెగ బాధపడిపోయింది. దాంతో సినిమా గురించి ఇంక ప్రచారం చేయడం మానేసిందని ఇప్పుడు నెటిజన్లు ఆడేసుకుంటున్నారు. నిన్నటివరకు సినిమా పీఆర్వోలా ప్రచారం చేసిన సమంత చివరకు చైతూను ముంచేసిన స్టార్ పీఆర్వో గా మారిందని కొందరు కామెంట్స్ చేస్తుండటం గమనార్హం. మొత్తంగా ఇప్పుడు సమంత తన స్టార్ డమ్ తో చైతూ సినిమాను లేపే ప్రయత్నం చేసినా అది వర్కౌట్ కాలేదని కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. మరి ప్రస్తుతం కొంచెం సైలెంట్ గానే ఉన్న సమంత ఈ విమర్శలకు ఎలా స్పందిస్తుందో చూడాలి.