ఎక్స్ ల‌వ్ గుట్టు ర‌ట్టు!

Last Updated on by

కెరీర్ బెస్ట్ ఫేజ్‌లో ఉంది అందాల స‌మంత‌. జెస్పీగా కెరీర్ ప్రారంభించింది. అటుపై ఎన్నో ఎత్తుల‌కు కెరీర్‌ని తీసుకెళ్ల‌గ‌లిగింది. అందివ‌చ్చిన ప్ర‌తి అవ‌కాశాన్ని ఎంతో డెడికేష‌న్‌తో స‌ద్వినియోగం చేసుకుని అసాధార‌ణ స్టార్‌డ‌మ్‌ని అందిపుచ్చుకుంది. టాలీవుడ్‌లోనే మోస్ట్ ల‌క్కీయెస్ట్ హీరోయిన్‌గా సామ్ పేరు మార్మోగిపోయింది. అదంతా అటుంచితే స‌మంత వ్య‌క్తిగ‌త జీవితంలో స‌రిగ‌మ‌ల గురించి, గ‌తం గురించి మ‌రోసారి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

అక్కినేని హీరో నాగ‌చైత‌న్య‌ను పెళ్లాడిన స‌మంత ఇదివ‌ర‌కూ హీరో సిద్ధార్థ్‌తో పీక‌ల్లోతు ప్రేమ‌లో ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఎక్స్ ల‌వ్‌ వ్య‌వ‌హారంపై టాలీవుడ్ మీడియా విస్త్ర‌తంగా క‌థ‌నాలు అల్లింది. క‌ట్ చేస్తే తానొక‌టి త‌లిస్తే విధి వేరొక‌టి త‌లిచిన చందంగా సిద్ధార్థ్ చివ‌రికి ఒంటరివాడ‌య్యాడు. అయితే సిద్ధార్థ్ గురించి సామ్ ఎంతో రియ‌లైజ్ అయ్యాన‌ని ఆ త‌ర‌వాత ఓ ఇంట‌ర్వ్యూలో తెల‌ప‌డం సంచ‌ల‌న‌మైంది. తాజాగా మ‌రోసారి అలాంటి ఓ వివాదాస్ప‌ద అంశాన్ని సామ్ ట‌చ్ చేసింది. మ‌హాన‌టి చిత్రం గురించి ఓ ఇంట‌ర్వ్యూల ప్ర‌స్థావించిన స‌మంత‌.. ఎక్స్ ల‌వ్ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. అప్ప‌టికే పెళ్ల‌యిన జెమిని గ‌ణేష‌న్‌ని పెళ్లాడి సావిత్రి ఎన్ని ఇబ్బందులు ప‌డిందో అన్ని ఇబ్బందులు ప‌డేదానిన‌ని, ఆ ప్రేమ నుంచి రియ‌లైజ్ అవ్వ‌డం వ‌ల్ల ఏదోలా బ‌య‌ట‌ప‌డ‌గ‌లిగాన‌ని తెలిపింది. ప్ర‌స్తుతం దీనిపై ఫిలింన‌గ‌ర్‌లో ఆసక్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

User Comments