అక్కినేని అంటే బాధ్య‌త అంటోన్న స‌మంత‌..

అక్కినేని వారింటికి కోడ‌లుగా వెళ్ల‌డం అంటే ఆనందంతో పాటు బాధ్యత కూడా ఉందంటుంది స‌మంత‌. మ‌నం చేసే ప్ర‌తీ ప‌ని చాలా బాధ్య‌త‌గా ఉండాల‌ని.. ఇప్పుడు తానేం చేసినా అక్కినేని కుటుంబాన్ని అంటార‌ని గుర్తు చేసుకుంది స‌మంత‌. ఆ ఇంటికి కోడ‌లిగా వెళ్ల‌డం త‌న అదృష్టం అంటుంది స‌మంత‌. అక్కినేని కుటుంబం త‌న నుంచి ఏమీ ఆశించ‌ట్లేద‌ని.. కానీ తాను మాత్రం ఆ ఫ్యామిలీకి చాలా రుణ‌ప‌డిపోయాయ‌ని.. చాలా బాధ్య‌త కూడా త‌న‌పై ఉంద‌ని చెప్పింది ఈ ముద్దుగుమ్మ‌. అంతేకాదు.. అక్కినేని కుటుంబంలో ఆడ‌వాళ్ల‌కు ఫ్రీడ‌మ్ ఉంటుందని.. అందుకే అమ‌ల‌, సుప్రియా లాంటి వాళ్లు అంత డేర్ గా ఉంటార‌ని చెబుతుంది స‌మంత‌.

త‌న‌కు కూడా అదే ఫ్రీడ‌మ్ ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంద‌ని.. దీనికి త‌న మామ‌య్య నాగార్జున‌తో పాటు చైతూ కూడా కార‌ణం అని చెప్పింది స‌మంత‌. రాజుగారిగ‌ది 2 ప్ర‌మోష‌న్ లో భాగంగా ఇవ‌న్నీ చెప్పింది స‌మంత‌. ఇక సినిమా గురించి మాట్లాడుతూ.. కొన్ని సినిమాల్లో ఎందుకు న‌టించామో అర్థం కాద‌ని.. కానీ ఈ చిత్రంలో ఎందుకు నటించానో అన్ని కార‌ణాలు ఉన్నాయ‌ని చెబుతుంది స‌మంత‌. అంతేకాదు.. ఈ చిత్రం ఫ్లాపైనా.. హిట్టైనా వారంలో మ‌రిచిపోతాం కానీ ఎన్నో గుర్తులు మాత్రం ఉన్నాయంటోంది స‌మంత‌. మొత్తానికి అక్కినేని వారింటికి వెళ్ళిన త‌ర్వాత బాగా మాట‌లు నేర్చేసింది ఈ ముద్దుగుమ్మ‌.