ఫోటో టాక్‌: ఇందిర‌మ్మ జెరాక్స్‌

Last Updated on by

ఫ్యాష‌న్ అండ్ ట్రెండ్స్‌ని అనుక‌రించ‌డంలో అందాల స‌మంత త‌ర‌వాతే ఇంకెవ‌రైనా. ట్రెండీగా చేనేత‌లో క‌నిపించినా, కంచిప‌ట్టు చీర‌లో క‌నిపించినా సామ్ త‌న‌దైన ముద్ర వేస్తుంది. ఎప్ప‌టిక‌ప్పుడు మారుతున్న ట్రెండ్‌క‌నుగుణంగా త‌న‌ని తాను మార్చుకుని వేగంగా కాలంతో పాటు ప‌రుగులు తీసే మేధోత‌నం స‌మంత‌కు ఉంది. అందుకే ఇంతింతై అన్న చందంగా టాలీవుడ్‌లో అసాధార‌ణ స్టార్‌డ‌మ్ అందిపుచ్చుకుని, ఇప్పుడు వ్య‌క్తిగ‌త జీవితంలోనూ తాను అనుకున్నది సాధించుకుంది. అక్కినేని కోడ‌లుగా, తాను వ‌ల‌చిన నాగ‌చైత‌న్య భార్యామ‌ణిగా స‌మంత పేరు మార్మోగిపోతోంది.

టాప్ టు బాట‌మ్ ఆ లుక్ చూస్తుంటే అచ్చం ఇందిర‌మ్మ‌ను త‌ల‌పించ‌డం లేదూ? ఆ డ్రెస్సింగ్ స్టైల్‌.. హెయిర్ స్టైల్.. ప్ర‌తిదీ కాంగ్రెస్ అధినేత్రి ఇందిరాగాంధీని గుర్తుకు ర‌ప్పించ‌డం లేదూ? యూట‌ర్న్ రీమేక్‌లో న‌టిస్తున్న స‌మంత ఆ సినిమాకోసం ప్ర‌త్యేక వేష‌ధార‌ణ‌, ఆహార్యం ప్ర‌ద‌ర్శించ‌నుంది. ఇదిగో ఇలా మోడ్ర‌న్ హెయిర్‌క‌ట్‌తో సంథింగ్ స్పెష‌ల్‌గా మేటి నాయ‌కురాలిని త‌ల‌పిస్తోంది. అన్న‌ట్టు కేసీఆర్‌, కేటీఆర్ బృందం వ‌చ్చే ఎన్నిక‌ల్లో స‌మంత‌కు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వ‌బోతున్నార‌న్న స‌మాచారం ఉంది. అప్పుడు ఎమ్మెల్యే ఇందిర‌మ్మ అని పిల‌వాలా? ఎమ్మెల్యే సామ్ అని పిల‌వాలా?

User Comments