స‌మంత బేబికి సైలెంట్ గా రిపేర్లు

Last Updated on by

అక్కినేని కోడ‌లు స‌మంత కొరియ‌న్ మూవీ మిస్ గ్రానీ రీమేక్ లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. నందినిరెడ్డి ఓ బేబి టైటిల్ తో తెర‌కెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రారంభం నుంచి షూటింగ్ వెళ్ల‌డం వ‌ర‌కూ అంతా యూనిట్ గోప్యంగానే ఉంచుతోంది. ఏదో ఒక చోట నుంచి లీకులంది న్యూస్లు రాసుకోవ‌డం త‌ప్ప‌! యూనిట్ అధికారికంగా ఏరోజు సినిమా గురించి అప్ డేట్ అందించ‌లేదు. తాజాగా ఓ బేబికి సంబంధించిన ఓ హాట్ అప్ డేట్ అందింది. ఈ సినిమా ఇప్ప‌టికే స‌గ భాగం షూటింగ్ పూర్తైన‌…నందిని అనుకున్న విధంగా ఔట్ ఫుట్ రాలేదుట‌. దీంతో బ్యాలెన్స్ సంగ‌తి త‌ర్వాత చూద్దామ‌ని ప‌క్క‌నబెట్టి? తీసిన బాగానికే మ‌ళ్లీ రీపేర్లు మొద‌లు పెట్టిన‌ట్లు స‌మాచారం.

ఎక్క‌డెక్క‌డ అయితే స‌న్నివేశాలు తేలిపోతున్నాయ‌ని చెక్ చేసుకుని వాటికి రీషూట్లు షురు చేసారుట‌. దీంతో సినిమా బ‌డ్జెట్ కూడా పెరుగుతుంద‌ని తెలుస్తోంది. అస‌లే ఈ చిత్ర నిర్మాత సురేష్ బాబు. ఎస్ పి ప్రొడ‌క్ష‌న్స్ నుంచి డ‌బ్బు మంచి నీళ్ల‌లా ఖ‌ర్చు చేసేద్దామంటే కుద‌ర‌దు. ఏదైనా ముందు చెప్పాలి. మ‌ధ్య‌లో రీషూట్లు గ‌ట్రా అంటే సురేష్ బాబు అంతెత్తున లేస్తాడు. కానీ ఇది మేనల్లుడు చైత‌న్య భార్య స‌మంత సినిమా కాబ‌ట్టి ఆవిష‌యంలో కానివ్వండ‌ని ముందుకు పంపిచాడుట‌. దీంతో నందిని రెడ్డి సెలైంట్ గా రీ షూట్ మొద‌లు పెట్టిందిట‌.

అస‌లే నందిని రెడ్డి సినిమాలంటే మార్కెట్ లో డిమాండ్ లేదు. కాపీ ద‌ర్శ‌కురాలిగా మంచి పేరు ఉంది. ఈ నేప‌థ్యంలో రీ షూట్ మ్యాట్ బ‌య‌ట‌కు రాకూడ‌ద‌ని చాలా జాగ్ర‌త్తలు తీసుకుంటోందిట‌. అయినా లీకుల బెడ‌ద త‌ప్ప‌లేదు. ఇక సినిమా రిలీజ్ కూడా అనుకున్న తేదికి రాద‌ని అర్ధ‌మ‌వుతోంది. రీషూట్ పూర్త‌వ్వాలి. …అటుపై బ్యాలెన్స్ పూర్తిచేసి ప్యాచ్ వ‌ర్క్ పాట‌లు పూర్తిచేయాల్సి ఉంటుంది. నందిని రెడ్డి స్లో మేకింగ్ నేప‌థ్యంలో సినిమా కంప్లీట్ చేయ‌డానికి మ‌రో నాలుగు నెల‌లైనా స‌మ‌యం ప‌డుతుంద‌ని అంటున్నారు.

User Comments