సామ్ కాలి న‌డ‌క ద‌ర్శ‌నం

Last Updated on by

ద‌శాబ్ధం పాటు స్టార్‌డ‌మ్‌ని కాపాడుకోవ‌డం అంటే ఆషామాషీ కాదు. అందం కించిత్ చెద‌ర‌కూడ‌దు. మ‌త్తుచ‌ల్లే య‌వ్వ‌న సిరిని మెయింటెయిన్ చేయాలి. అలా చేయాలంటే అందుకు త‌గ్గ‌ట్టు శారీర‌కంగానూ శ్ర‌మించాలి. ఫిజిక‌ల్ ఫిట్ నెస్ కోసం జిమ్ముల్లో నిరంత‌రాయంగా శ్ర‌మిస్తూ ఆహార నియమ‌యం పాటిస్తేనే ఇదంతా సాధ్యం. అయితే ఈ విష‌యంలో న‌వ‌త‌రం క‌థానాయిక‌లు ఎంతో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. నిరంత‌రం గంట‌ల కొద్దీ శారీర‌క వ్యాయామం చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. కొంద‌రు నాయిక‌లు ఒంపుసొంపుల దేహ‌శిరుల్ని తీర్చిదిద్ది.. ముగ్ధ‌మ‌నోహ‌ర రూపంతో రంగుల ప్రపంచాన్ని ఏల్తున్నారు.

ఈ విష‌యంలో అక్కినేని కోడ‌లు స‌మంత రేస్‌లో ఎప్పుడూ టాప్‌లో ఉంటుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. సామ్ తొలినుంచి శారీర‌క వ్యాయామం విష‌యంలో ఎంతో కేర్‌ఫుల్‌గా ఉన్నాన‌ని ఇదివ‌ర‌కూ ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు. ఇప్ప‌టికీ పెళ్లి త‌ర్వాత ఫిట్‌నెస్ కాపాడుకునేందుకు క‌స‌ర‌త్తుల్ని ఆప‌కుండా సాగిస్తున్నాని తెలిపారు. అయితే అదంతా ఆర్టిఫిషియ‌ల్. కాస్తంత నేచుర‌ల్‌గా ఫిట్‌నెస్ కాపాడుకునే ఓ కొత్త త‌రుణోపాయం ఉంద‌ని ఇదిగో తాజాగా స‌మంత క‌నిపెట్టిందిట‌. నిన్న‌నే త‌న ఫ్రెండు, టీవీ న‌టి ర‌మ్య సుబ్ర‌మ‌ణియ‌న్‌తో క‌లిసి ఏకంగా 3500 మెట్లు ఎక్కి తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంలో మొక్కు తీర్చుకుందిట‌. తిరుమ‌లేశుని చెంత‌కు కొండ దిగువ నుంచి కాలిన‌డ‌క‌న వెళ్లాన‌ని తెలిపింది. ఆ మేర‌కు ఇన్‌స్టాగ్ర‌మ్‌లో ఓ వీడియోని సామ్ షేర్ చేసింది. సెల‌బ్రిటీలు ఇలా చేయ‌డం సామాన్యుల‌కు సైతం స్ఫూర్తినిస్తుంది. అంద‌రిలో ఆరోగ్యంపై అవ‌గాహ‌న పెంచుతుంది. సామ్ మంచి ప‌నే చేసింది క‌దూ?

User Comments