సామ్ స్ట‌న్నింగ్ న్యూ లుక్

అక్కినేని కోడ‌లు స‌మంత ఫ్యాష‌న్స్ గురించి తెలిసిందే. ఓవైపు తెలంగాణ‌లో చేనేత‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ప‌ని చేస్తున్న స‌మంత మార్కెట్లోకి ఏ కొత్త ట్రెండ్ వ‌చ్చినా దానిని పాపుల‌ర్ చేసేస్తోంది. తాజాగా స‌మంత న్యూలుక్ యువ‌త‌రంలో ట్రెండ్ అవుతోంది. మెడ‌లో ముత్యాల హారం.. బెనారస్ చీర‌లో అద‌ర‌హో అన్న చందంగా స‌మంత ఇస్తున్న ట్రీట్ ఫ్యాన్స్ ను మైమ‌రిపిస్తంది. అన్న‌ట్టు ఖ‌రీదైన ఆ హారం.. అంతే ఖ‌రీదైన బెనార‌స్ చీర‌.. ఇంకా ఇంకా లేటెస్ట్ ట్రెండ్స్ ని ఈ అమ్మ‌డు ఫాలో అవుతూ యువ‌త‌రానికి కొత్త గోల్స్ ని నిర్ణ‌యిస్తోంది. అయితే ఒక్కో క‌మిట్ మెంట్ కి 2-3 కోట్ల పారితోషికం అందుకునే స‌మంత‌తో పోటీప‌డుతూ న‌వ‌త‌రం ఇలా క‌నిపించాల‌నుకుంటే క‌ష్ట‌మే. పిండి కొద్దీ రొట్టె. సంపాద‌న కొద్దీ ఫ్యాష‌న్ అని అనుకోవాలి.

sam

స‌మంత కెరీర్ ప‌రంగా చూస్తే ఏడాదికి రూ.5-8 కోట్ల మినిమం వార్షికాదాయంతో దూసుకుపోతోంది. తెలుగు, త‌మిళంలో వ‌రుస‌గా చిత్రాల‌కు సంత‌కాలు చేస్తూ బాగానే ఆర్జిస్తోంది. ప్ర‌స్తుతం నాగ‌చైత‌న్య స‌ర‌స‌న మ‌జిలీ అనే చిత్రంలో న‌టిస్తోంది. త‌దుప‌రి నందిని రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో మిస్ గ్రానీ రీమేక్ లో ఓల్డ్ ఉమెన్ గెట‌ప్ తో ద‌ర్శ‌న‌మీయ‌నుంది. మొత్తానికి 2019లోనూ బిగ్ గోల్స్ తో దూసుక‌పోతోంది. ప్ర‌స్తుతం బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ స‌ర‌స‌న సామ్ ఓ చిత్రానికి సంత‌కం చేసింద‌న్న ప్ర‌చారం సాగుతోంది. త‌దుప‌రి మ‌రిన్ని ప్రాజెక్టులు క్యూలో ఉన్నాయి.