క్యూ లైన్‌లో సామ్ మూడు చిత్రాలు

Last Updated on by

అక్కినేని నాగ‌చైత‌న్య – స‌మంత జంట‌గా న‌టిస్తున్న `మ‌జిలీ` ఏప్రిల్ 5న రిలీజ్ కి రెడీ అవుతున్న సంగ‌తి తెలిసిందే. అలాగే త‌మిళ చిత్రం సూప‌ర్ డీల‌క్స్ మార్చి 29న రిలీజ‌వుతోంది. ఈ రెండు సినిమాల రిలీజ్ ల గురించి మాట్లాడుతుండ‌గానే సామ్ న‌టించిన మూడో సినిమా రిలీజ్ గురించిన ముచ్చ‌ట తెలిసింది. స‌మంత కీల‌క పాత్ర‌లో నందిని రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `ఓ బేబి` ఈ వేస‌విలో రిలీజ్ కి రానుంది. ఆ మేర‌కు స‌మంత ట్విట్ట‌ర్, ఇన్ స్టాగ్ర‌మ్ లో వివ‌రాల్ని అందించారు.

“నేడు ఎంతో గొప్ప‌గా ఉంది. ఈ జీవ‌న గ‌మ‌నంలో నేనేంటో తెలుసుకునే ప్ర‌య‌త్నంలో దేవుడు ఎంతో సాయం చేశారు. వ్య‌క్తిగ‌తంగా.. వృత్తి గ‌తంగా ఎదిగేందుకు టైమ్ తీసుకున్నా. ప‌యనంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర‌య్యాయి. కానీ నేటి ఈ ఎదుగుద‌ల ఎంతో సంతృప్తిక‌రంగా ఉంది. ఓ బేబి చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. వేస‌విలో రిలీజ‌వుతోంది. ఈ అవ‌కాశం ఇచ్చిన నందిని రెడ్డికి చాలా కృత‌జ్ఞ‌త‌లు“ అని పేర్కొంది సామ్. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ- సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సీనియ‌ర్ న‌టి ల‌క్ష్మి, రాజేంద్ర ప్ర‌సాద్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. స‌మంత 20 ఏళ్ల యువ‌తిగా, 60 ఏళ్ల వృద్ధురాలిగా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. 20 వ‌య‌సు అమ్మాయి కావాల‌నుకునే 60 వ‌య‌సు భామ్మ క‌థే ఓ బేబి. కొరియ‌న్ సినిమా మిస్ గ్రానీకి రీమేక్ ఇది. నాగ శౌర్య ఓ కీల‌క పాత్ర పోషించారు.

Also Read: Samantha Wrapped Her Role For Oh Baby!

User Comments