మ‌హాన‌టితో బిజీ గా ఉన్న సమంత

ఇన్నాళ్లూ మ‌హానటి సినిమా పేరు చెప్ప‌గానే వెంట‌నే గుర్తొచ్చే పేరు కీర్తిసురేష్. ఇందులో సావిత్రి పాత్ర‌లో న‌టిస్తుంది కాబ‌ట్టి ముందుగా ఆమె పేరే గుర్తుకురావడం స‌హ‌జ‌మే. కానీ ఇందులో స‌మంత కూడా కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తుంది. అదే జ‌మున పాత్ర‌. క‌థ‌ను న‌డిపించే పాత్ర ఇదే. ఇప్పుడు ఈ పాత్ర‌కు సంబంధించిన సీన్స్ ను చిత్రీక‌రిస్తున్నాడు ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్. అందుకే త‌న వంతుగా మ‌హాన‌టి ప్ర‌మోష‌న్ ను భుజాన వేసుకుంది స‌మంత‌. త‌న పార్ట్ షూటింగ్ జ‌రుగుతున్న టైమ్ లోనే ఓ లూనాకు క్లాప్ బోర్డ్ త‌గిలించి ఉన్న ఫోటోను ట్వీట్ చేసింది స‌మంత‌. అంటే డిసెంబ‌ర్ లో త‌న పాత్ర‌కు సంబంధించిన స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంద‌ని దాన‌ర్థం అన్న‌మాట‌.

సావిత్రి జీవితం అంటే కొంద‌రి సొత్తు కాదు.. అది అంద‌రు తెలుగు వాళ్ల హ‌క్కు. ఈమె జీవితం తెరిచిన పుస్త‌కం. ఇప్పుడు ఆ తెరిచిన పుస్త‌కానికి తెర‌రూపం ఇస్తున్నాడు ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్. ఈ తెర‌రూపాన్ని క‌నులారా చూడాలని కోరుకోని తెలుగు ప్రేక్ష‌కుడు ఉండడేమో అంత అతిశ‌యోక్తి కాదు. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ద‌ర్శ‌కుడికి రాని ఆలోచ‌న నాగ్ అశ్విన్ కు వ‌చ్చింది. వ‌చ్చిందే త‌డువుగా సావిత్రి జీవితంపై మ‌హాన‌టి సినిమా మొద‌లు పెట్టాడు. అది కూడా ఏదో ఆషామాషీగా కాదు. పెద్ద పెద్ద స్టార్స్ ను పెట్టుకుని.. ఒకే సినిమా అనుభ‌వం ఉన్న నాగ్ అశ్విన్ చేస్తోన్న మ‌హాయ‌జ్ఞం ఈ మహాన‌టి. ఇప్ప‌టికే విడుద‌లైన మోష‌న్ పోస్ట‌ర్ కు మంచి అప్లాజ్ వ‌చ్చింది. ఇక మార్చ్ 29న సినిమా విడుద‌లైన త‌ర్వాత ఎంత ర‌చ్చ చేస్తుందో ఈ మ‌హాన‌టి.

User Comments